Updates..
► జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఆఫీసు లోపల బైఠాయించి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వినతి పత్రం ఇస్తే జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమర్యాదగా ప్రవర్తించారంటూ నిరసనలు తెలిపారు.
► జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసు వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
► జీహెచ్‌ఎంసీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.
► దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
► ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైంది. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జీహెచ్‌ఎంసీ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల రికార్ఢు స్థాయిలో వర్షం కురువడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇటు, భారీ వరదల కారణంగా చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు.. హైదరాబాద్‌లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ నేపథ్యంలో వర్షాలపై అప్రమత్తం కానందుకు అధికార బీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జీహెచ్‌ఎంసీ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వరద బాధితులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, తెలంగాణ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్‌ఎంసీ ఎదుట భారీగా మోహరించారు. జీహెచ్ఎంసీకి ఉన్న మూడు గేట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
ఇది కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment