మూడేళ్ల పాలనలో ఒరగబెట్టిందేమీలేదు
టీఆర్‌ఎస్, బీజేపీలపై జూలకంటి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీల అమల్లో విఫలమయ్యాయని, మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ బీజేపీ విషయంలో టీఆర్‌ఎస్ వైఖరేమిటో స్పష్టం చేయాలన్నారు.
ఒకవైపు ప్రధాని మోదీని సమర్థిస్తూ, మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను సీఎం కేసీఆర్ విమర్శించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బలపరుస్తామని కేసీఆర్ చెప్పడాన్ని తప్పుబట్టారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఓటుబ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.