
సమస్యలపై గవర్నర్‌కు శ్రద్ధ లేదు: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కు ఏమాత్రం శ్రద్ధ లేదని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను పొగడ్తలతో ముంచెత్తుతూ కాలక్షేపం చేస్తున్నారన్నారని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, చట్టాలు అమలు చేయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు.
రాష్ట్రంలోని ప్రజా సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, వారికి న్యాయం జరిగేలా గవర్నర్ వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.