ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, నిరసనలు తెలిపిన సభ్యులను అరెస్ట్ చేయడం ఏమిటని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, నిరసనలు తెలిపిన సభ్యులను అరెస్ట్ చేయడం ఏమిటని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. అసలు అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. అసెంబ్లీని, ప్రభుత్వాన్ని నిరంకుశంగా నడిపే విధానాన్ని సీఎం కేసీఆర్ మార్చుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.
బుధవారం శాసనసభలో జరిగిన పరిణామాలను ఖండిస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వందల కోట్లు పేరుకుపోతే బుకాయించే ధోరణిలో సీఎం మాట్లాడడం సరికాదన్నారు. గవర్నర్ కూడా ప్రజా సమస్యలపై, ప్రజా సంక్షేమంపై ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు విజ్ఞప్తులు చేసినా, లేఖలు రాసినా గవర్నర్ కార్యాలయం నుంచి స్పందన లేదన్నారు.