రైతు పక్షపాతం.. ప్రచారమే: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రచారం చేసుకోవడం తప్ప వారిని ఆదుకోవడం కోసం అధికార టీఆర్‌ఎస్ చేపడుతున్న చర్యలు శూన్యమని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. తీవ్ర సమస్యల్లో ఉన్న రైతులను ఆదుకోడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వరి క్వింటాల్‌కురూ.2 వేలు అయినా గిట్టుబాటు ధర లేకపోతే రైతులు సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదని, ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న సొమ్ముకు అదనంగా కలిపి ధాన్యం క్వింటాల్‌కు రూ.2 వేలు చెల్లించాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పంట దెబ్బతిన్నదనే పేరుతో దళారులు పత్తిని రూ.2-3 వేల లోపే కొంటున్నారని, ప్రభుత్వం సీసీఐ సెంటర్ల ద్వారా రూ.5 వేలకు పైబడి కొనుగోలు చేసేలా చూడాలని కోరారు.