దామరచర్ల(మిర్యాలగూడ): ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. దామరచర్ల మండలం కల్లేపల్లిలో మంగళవారం ఆయన మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. మిర్చి ధరలు గత ఏడాదితో పోలిస్తే సగం తగ్గడంతో రైతులకు పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ౖ
రెతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్దతు ధర అందించి వారిని ఆదుకోవాలన్నారు. మిర్చి రైతుల సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో త్వరలో ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామన్నారు. జూలకంటి వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డి.మల్లేశ్, డి.చంద్రశేఖర్ యాదవ్, పాపానాయక్, బైరం దయానంద్, ఎర్రానాయక్, మల్లు గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిర్చి రైతులను ఆదుకోవాలి : జూలకంటి
Published Wed, Apr 5 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
Advertisement