
బిందుమాధవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తి కథా చిత్రం నాగ.. చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఇందులో మరో నాయికగా నటి రైసా నెల్సన్ నటిస్తున్నారు. ఎమ్మెస్ మూవీస్ అధినేత కె.మురుగన్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ప్రస్తుతం ప్రభుదేవా, మహిమా నంబియార్ జంటగా ఈయన నిర్మిస్తున్న గరుడ పంచమి చిత్రం నిర్మాణదశలో ఉంది.
తాజాగా నిర్మిస్తున్న నాగ చిత్రానికి ఛార్లెస్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ సన్నివేశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. పురాణాల్లో చెప్పినట్లుగా నాగలోకం ఇప్పటికీ ఉన్నట్లు గ్రాఫిక్ సన్నివేశాలతో ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు తెలిపారు. సముద్రగర్భం నుంచి పైకి వచ్చే మానసాదేవి అనే పంచ తల్లి నాగదేవతకు సంబంధించిన సన్నివేశాలు ఆ బాలగోపాలాన్ని అలరిస్తాయన్నారు. తమిళనాడులోని నాగ ర్ కోవిల్ తదితర ప్రాంతాల్లో ఉన్న నాగరాజా ఆలయాల్లో చిత్రీకరణ నిర్వహించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment