బిందుమాధవి అచ్చ తెలుగు హీరోయిన్. 'ఆవకాయ బిర్యానీ', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాల్లో కథానాయికగా నటించిన ఈమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో వాలిపోయిన ఆమెకు అక్కడ అవకాశాలతోపాటు ఆదరణ కూడా బాగానే ఉండటంతో అక్కడే సెటిలైంది. కన్నడ బిగ్‌బాస్‌లోనూ పాల్గొన్న బిందు తెలుగు బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొంది.
షో ప్రారంభంలో ఆమె మాట్లాడుతూ.. 'కన్నడ బిగ్‌బాస్ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టాను. అప్పుడు నేను డిప్రెషన్‌లో ఉన్నాను. లవ్ ఫెయిల్యూర్ వల్ల నేను ఎంతో బాధలో ఉన్నాను. కానీ షో నుంచి బయటకు వచ్చేసరికి డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. నా స్వస్థలం చిత్తూరులోని మదనపల్లి. బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. మస్తీ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన హీరోయిన్ బిందుమాధవికి ఆడపులిగా పేరు తెచ్చుకుంది. తన ఆటతో, ధైర్యంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజేతగా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment