
సాక్షి, చెన్నై: బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న అనంతరం బిందుమాధవి చాలా ఖుషీగా ఉంది. షో ద్వారా చాలా మంది పాపులారిటీ తెచ్చుకున్నారు. నటి ఓవియ, రైసా లాంటి హీరోయిన్లకు బిగ్‌బాస్ ముందు, ఆ తరువాత అని చెప్పుకునేలా కెరీర్ మారింది. బిగ్‌బాస్ గేమ్‌లోకి కాస్త ఆలస్యంగా వచ్చిన నటి బిందుమాధవి కేరీర్ ఇప్పుడు జోరందుకుంది. పళనియప్పన్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
పార్తీపన్ కణవు లాంటి వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు పళనియప్పన్ చాలా గ్యాప్ తరువాత మోగాఫోన్ పడుతున్నారు. ఆయన పెగళేంది ఎనుమ్ నాన్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో అరుళ్‌నిధి హీరోగానూ, బిందుమాధవి హీరోయిన్‌గానూ నటించనున్నారు. ఈ సందర్భంగా బిందుమాధవి స్పందిస్తూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే వాటిని ఎంపిక చేసుకునే విషయంలో కేర్ తీసుకుంటున్నానని తెలిపింది. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రల్నే కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అలాంటి చిత్రమే పుగళేంది ఎనమ్ నాన్ అని తెలిపింది.
కరు పళనియప్పన్ చిత్రాలలో కథానాయికలకు ప్రాముఖ్యం ఉంటుందని, అలాంటి దర్శకుడితో పని చేయనుండటం సంతోషంగా ఉందని అంది. పుగళేంది ఎనుమ్ నాన్ రాజకీయ నేపధ్యంలో సాగే కథ అని, అయినా తన పాత్రలో నటనకు అవకాశం ఉంటుందని చెప్పింది. అదే విధంగా అరుళ్‌నిధికి జంటగా నటించడం ఆనందంగా ఉందని అంది. ఈ చిత్రం తరువాత నటుడిగా ఆయన స్థాయి మరింత పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం డిసెంబరులో సెట్‌పైకి వెళ్లనుందనీ, ఆ రోజు కోసం చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment