Bigg Boss OTT Non Stop: Eliminate Bindu Madhavi Trending On Twitter, Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop-Bindu Madhavi: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్‌, టైటిల్‌ గెలిచే అర్హత లేదంటూ..

Published Tue, May 3 2022 5:12 PM | Last Updated on Tue, May 3 2022 6:16 PM

Bigg Boss OTT Non Stop: Eliminate Bindu Madhavi Trending On Twitter - Sakshi

Bindu Madhavi: ఫ్యామిలీ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్‌ ఓటీటీ మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యంగా అఖిల్‌, బిందుమాధవి, యాంకర్‌ శివ మధ్యే టైటిల్‌ పోరు ఉందన్న విషయం స్పష్టమైంది. మరీ ముఖ్యంగా ఈసారి లేడీ కంటెస్టెంట్‌ గెలిచే అవకాశాలున్నాయంటూ సోషల్‌ మీడియాలో బిందుమాధవి గురించి విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఫినాలే దగ్గరపడిన తరుణంలో ఎంతో జాగ్రత్తగా, ఆచితూచి ఆటాడాల్సిన క్రమంలో బిందు మాధవి అదుపు తప్పుతోంది. గట్టిగట్టిగా అరుస్తూ తను చెప్పేదే రైట్‌ అని బల్లగుద్ది చెప్పే తను నిన్నటి ఎపిసోడ్‌లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది.

సాధారణంగా నామినేషన్స్‌లో మిత్ర తను నామినేట్‌ చేయాలనుకునేవాళ్లను ఇమిటేట్‌ చేసి ఇరిటేట్‌ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం బిందు ఆ పనిని తన భుజానెత్తుకుంది. మిత్రను నామినేట్‌ చేస్తూ ఆమె ఎలా ప్రవర్తించేదో ఇమిటేట్‌ చేసి చూపించింది. ఈ క్రమంలో ఆమె ప్రవర్తన అతిగా అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే తనను చులకన చేస్తూ మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో 'ఎలిమినేట్‌ బిందుమాధవి'(#Eliminate Bindu Madhavi) అన్న హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. మిత్ర మాట్లాడుతున్నంతసేపూ బిందు ఆమెను ఇమిటేట్‌ చేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలతో ఈ సీజన్‌లోనే వరస్ట్‌ బిహేవియర్‌ అనిపించిందని పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

దగ్గరైనవాళ్లకే వెన్నుపోటు పొడుస్తావని మిత్రను నిందించిన బిందు.. మరి తనకు క్లోజ్‌ అయిన శివను నామినేట్‌ చేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా టైటిల్‌ రేసులో ఉన్న బిందు ఈ ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిందంటున్నారు. కానీ బిందు ఫ్యాన్స్‌ మాత్రం ముళ్లును ముళ్లుతోనే తీయాలని, మిత్రకు సరిగ్గా బుద్ధి చెప్పిందని సపోర్ట్‌ చేస్తున్నారు.

చదవండి: నేను కథ వినను: ఎడిటర్‌

 ఆయన ఫోటో చూసి బోరున విలపించిన మిత్రాశర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement