Bigg Boss OTT Telugu Non Stop Winner Bindu Madhavi Clarifies About Secret Smoking - Sakshi
Sakshi News home page

Bindu Madhavi: సీక్రెట్‌ స్మోకింగ్‌పై స్పందించిన బిందుమాధవి

Published Mon, May 23 2022 4:26 PM | Last Updated on Mon, May 23 2022 5:24 PM

Bigg Boss Non Stop Winner Bindu Madhavi About Smocking - Sakshi

అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయని, బాత్రూమ్‌లో కూడా పొగ వాసన వస్తుందని నటరాజ్‌ ఎప్పుడో పసిగట్టాడు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ అషూకు సిగరెట్‌ తాగావా? అన్న ప్రశ్న ఎదురైంది. కానీ అషూ తెలివిగా దాని నుంచి తప్పించుకుంది. తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్‌ మీడియాలో సరదాగా చిట్‌చాట్‌ చేసిన బిందుమాధవికి సైతం అదే ప్రశ్న ఎదురైంది. నువ్వు స్మోకింగ్‌ చేస్తున్నావని స్రవంతి.. అఖిల్‌తో పాటు

మొదట్లో బిగ్‌బాస్‌ షో అంటే కేవలం టీవీలకే పరిమితమయ్యేది. కానీ ఓటీటీలు వచ్చాక బిగ్‌బాస్‌ రూటు మారింది. గంట ఎపిసోడ్‌ మాత్రమే ఎందుకు చూపించాలి, హౌస్‌లో ఏం జరుగుతుందో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తే పోలా అనుకున్నారు. అనుకున్నట్లుగా బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ప్రవేశపెట్టారు. 24 గంటలు లైవ్‌ స్ట్రీమింగ్‌ అందుబాటులోకి తేవడమే కాకుండా నిరంతరం షో చూడలేనివాళ్ల కోసం ప్రత్యేకంగా గంట ఎపిసోడ్‌ కూడా పెట్టారు.

కంటెస్టెంట్ల మీద ఓ కన్నేసి ఉంచే వాటినుంచి తప్పించుకుని ఏమీ చేయలేరు కంటెస్టెంట్లు. కానీ కెమెరాలకు సైతం కనబడకుండా అషూ, బిందు మాధవి సిగరెట్‌ తాగారంటూ ప్రచారం జరిగింది. అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయని, బాత్రూమ్‌లో కూడా పొగ వాసన వస్తుందని నటరాజ్‌ ఎప్పుడో పసిగట్టాడు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ అషూకు సిగరెట్‌ తాగావా? అన్న ప్రశ్న ఎదురైంది. కానీ అషూ తెలివిగా దాని నుంచి తప్పించుకుంది.

తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్‌ మీడియాలో సరదాగా చిట్‌చాట్‌ చేసిన బిందుమాధవికి సైతం అదే ప్రశ్న ఎదురైంది. నువ్వు స్మోకింగ్‌ చేస్తున్నావని స్రవంతి.. అఖిల్‌తో పాటు అతడి ఫ్రెండ్స్‌కు చెప్పింది. అది నిజమేనా? అని ఓ అభిమాని అడిగారు. దీనికి బిందు స్పందిస్తూ.. తానసలు పొగ తాగలేదని స్పష్టం చేసింది. తనకా అలవాటు ఉండుంటే ఓపెన్‌గానే స్మోకింగ్‌ చేసేదాన్నని చెప్పుకొచ్చింది.

చదవండి 👉🏾 హీరోయిన్‌ ప్రణీత బేబీ బంప్‌ ఫొటోలు వైరల్‌
 కుంభకర్ణుడిలా పడుకుంది చాలు, ముందు అప్‌డేట్‌ ఇవ్వు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement