చిత్తూరు జిల్లాలోని మదనపల్లి బిందు మాధవి జన్మస్థలం. తండ్రి వృత్తి రీత్యా చెన్నైలో స్థిరపడటంతో, ఆమె చదువు అక్కడే సాగింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. తనిష్క్ జ్యూలరీ ప్రకటనలో ఆమెను గమనించిన శేఖర్ కమ్ముల ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చారు. తర్వాత ‘బంపర్ ఆఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘పిల్ల జమీందార్’ సినిమాలు చేసింది.
గౌతం మీనన్ శిష్యురాలైన అంజనా అలీఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘వప్పం’ తమిళ చిత్రంలో ఓ వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, తన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సినిమా చాన్స్‌లు క్యూ కట్టాయి. దాదాపు పదికిపైగా పరభాషా చిత్రాల్లో నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ పన్నేండేళ్ల తర్వాత తెలుగులో ఓ బుల్లితెర షోలో ప్రత్యక్షమైంది.
తెలుగు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి, అద్భుత ఆట కనబరచి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘యాంగర్ టే ల్స్’ అంథాలజీలో ఒక గృహిణిగా.. తనకెంతో అవసరమైన మధ్యాహ్న నిద్రను చెడగొట్టే వారి అంతు చూసే పాత్రలో జీవించి అదరగొట్టింది.
చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, యాక్టింగ్ అంటే ఆసక్తి. స్కూల్ డేస్‌లో రన్నింగ్, సైక్లింగ్‌లో చాంపియన్. పుస్తకాలు కూడా బాగా చదువుతుంది.తెలుగు సినిమాల్లోనే కాదు, పరభాషా చిత్రాల్లోనూ అదరగొడుతూ సత్తా చాటుతున్న తెలుగు నటీమణుల్లో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవి కూడా ఉంది.
ఇతరుల డ్రెస్సింగ్ స్టయిల్‌పై చాలామంది ట్రోల్ చేస్తుంటారు. మనం ధరించే దుస్తులను బట్టి ఇచ్చే గౌరవ మర్యాదలు నాకు అస్సలు అవసరం లేదు.
– బిందు మాధవి
Comments
Please login to add a commentAdd a comment