
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్ ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలోనే ప్రసారమవుతోంది బిగ్‌బాస్ ఓటీటీ. వినోదానికి లేదు ఫుల్‌స్టాప్ అంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24 గంటలు స్ట్రీమింగ్ అవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్, శ్రీరాపాక, చైతూ, సరయు ఉన్నారు. అయితే మొట్టమొదటగా ఎలిమినేట్ అయిన ముమైత్ తాజాగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో అఖిల్.. బిందుమాధవి గురించి మాట్లాడటంతో హర్ట్ అయినట్లుంది అషూ. ఇక హౌస్‌లో ఓ టాస్క్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. భార్యాభర్తలకు మధ్య జరిగిన గొడవను పరిష్కరించేందుకు కోర్టు సీన్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో శివ లాయర్‌గా వాదిస్తున్న సమయంలో సడన్‌గా ముమైత్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో హౌస్‌మేట్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. వచ్చీరాగానే జడ్జి స్థానంలో కూర్చున్న ముమైత్ విడాకుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్, బిందుమాధవిలకు ముమైత్ విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే!
చదవండి: ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని హాస్టల్‌లో పెట్టాను: యాంకర్ భర్త
Comments
Please login to add a commentAdd a comment