Mumait Khan
-
Bigg Boss: అఖిల్- బిందుమాధవికి విడాకులు, ముమైత్ రీఎంట్రీ!
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్ ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలోనే ప్రసారమవుతోంది బిగ్‌బాస్ ఓటీటీ. వినోదానికి లేదు ఫుల్స్టాప్ అంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24 గంటలు స్ట్రీమింగ్ అవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్, శ్రీరాపాక, చైతూ, సరయు ఉన్నారు. అయితే మొట్టమొదటగా ఎలిమినేట్ అయిన ముమైత్ తాజాగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అఖిల్.. బిందుమాధవి గురించి మాట్లాడటంతో హర్ట్ అయినట్లుంది అషూ. ఇక హౌస్‌లో ఓ టాస్క్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. భార్యాభర్తలకు మధ్య జరిగిన గొడవను పరిష్కరించేందుకు కోర్టు సీన్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో శివ లాయర్‌గా వాదిస్తున్న సమయంలో సడన్‌గా ముమైత్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో హౌస్మేట్స్ సర్ప్రైజ్ అయ్యారు. వచ్చీరాగానే జడ్జి స్థానంలో కూర్చున్న ముమైత్ విడాకుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్, బిందుమాధవిలకు ముమైత్ విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని హాస్టల్లో పెట్టాను: యాంకర్ భర్త -
ఇంటర్వ్యూలో ముమైత్ నా చేయి విరగ్గొట్టింది: శ్రీరాపాక కన్నీటిపర్యంతం
బిగ్‌బాస్.. వినోదానికే కాదు, వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్. కేవలం గంటపాటు చూపించే ఎపిసోడ్‌లోనే ఆటపాటలు, అలకలు, కొట్లాటలు, కేరింతలు, సరదాలు, ఏడుపులు, పెడబొబ్బలు.. ఇలా ఎన్నింటినో చూపించారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందనేది ప్రేక్షకులకు 24 గంటలు చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతో పురుడు పోసుకున్నదే బిగ్‌బాస్ ఓటీటీ. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో సరికొత్తగా ముందుకు వచ్చింది. ఈసారి టీవీ ఛానల్లో కాకుండా కేవలం హాట్‌స్టార్‌లో మాత్రమే వీక్షించే అవకాశం కల్పించారు. అది కూడా కేవలం గంట ఎపిసోడ్‌లా కాకుండా 24 గంటలు ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. అప్పుడే హౌస్‌లో మొదటి నామినేషన్స్ కూడా జరిగిపోయాయి. ఈ నామినేషన్స్ తర్వాత కంటెస్టెంట్ల మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో ముమైత్ ఖాన్ వల్ల హీరోయిన్ శ్రీరాపాక బాగా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఆమె తోటి కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. 'మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ముమైత్ ఖాన్ నా చేయి విరగ్గొట్టింది, అప్పుడు నా చేయి వాచిపోయింది. దీనికి ఆర్జే చైతూనే సాక్ష్యం. ఆ సమయంలో చైతూ, కాజల్ అక్కడే ఉన్నారు. చేయి విరిగినట్లున్న రిపోర్టులు చూసి నా వైపు నిలబడ్డారు. అయినా సరే ఆ విషయాన్ని నేను అక్కడితో వదిలేశాను. కానీ ముమైత్ ఇంకా దాన్నే మనసులో పెట్టుకుంది. ఇప్పుడు బిగ్‌బాస్‌కు వచ్చాక నాతో అదోలా మాట్లాడుతోంది. నేనే స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లినా కూడా సరిగా మాట్లాడటం లేదు. పైగా నన్ను లయర్ అనేసింది. నా శరీరానికి గాయం చేసినా పట్టించుకోలేదు. కానీ ఆమె మాత్రం అదే విషయాన్ని పట్టుకుని వేలాడుతూ నన్ను అంత మాట అనేసింది. చీటింగ్, లయర్ అనేవి నాకు నచ్చని పదాలు. ఆ మాట నేను భరించలేకపోతున్నాను' అంటూ తన బాధను బయటకు చెప్పుకుంటూ ఏడ్చేసింది శ్రీరాపాక. దీంతో మిగతా కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చారు. మరి నిజంగానే ముమైత్ గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుందా? వీళ్లిద్దరి మధ్య దూరం పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది చూడాలి! -
ఆసక్తికరంగా ‘హేజా’ టీజర్
మిస్టర్ 7 , యాక్షన్ 3D , చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం హైలైట్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. చాల రోజుల తర్వాత నటి ముమైత్ ఖాన్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ స్తుండగా వీఎన్వీ క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంట్రస్టింగ్‌గా కట్ చేసిన టీజర్ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేసేలా ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సూపర్బ్ అనిపించేలా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశీ మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఫస్ట్ టైం హీరోగా, దర్శకుడిగా మరి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్‌గారు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూవీ అవుట్‌పుట్ చాల బాగా ఉంది. ఈ సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. నిర్మాత కేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ సినిమాలకు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండబోతుంది. దర్శకుడు ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల చేస్తాం’ అన్నారు. -
‘కోర్టుకి వెళ్లయినా సినిమా విడుదల చేస్తాం’
బెనర్జీ, వెంకట్, ముమైతఖాన్, సంజీవ్‌కుమార్, సుమన్ రంగనాథన్ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం తెరకెక్కిన సినిమా ‘దండుపాళ్యం 4’. ఈ సినిమాకు వెంకట్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి సీక్వల్ కాదని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాలో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ రూపొందిందని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘సినిమా షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇటీవల సెన్సార్ అప్లై చేశాను. కంటెంట్ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్ చేస్తానని చెప్పారు. సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్ చెయ్యను. రివైజ్ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్ కమిటీనే కాదు.. ట్రిబ్యునల్ అదీ కాకపోతే.. కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం’ అనని తెలిపారు. ‘ఇంతకన్నా క్రైమ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్ నుంచి కూడా వెళ్లిపోయాయి. మా సినిమాతో సెన్సార్ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడదల చేస్తాం’ అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవకశం వచ్చిందని డి.ఎస్.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎఫ్ఎంలో ముమైత్ జోరు..
బంజారాహిల్స్: ‘తిక్క’ సినిమాలో నా నృత్యం, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తున్నాన’ని సినీ నటి ముమైత్‌ఖాన్ చెప్పారు. బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో శుక్రవారం ఆమె సందడి చేశారు. ‘తిక్క’ శనివారం విడుదల కానున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. -
సింగర్ అవతారమెత్తుతున్న ఐటం బేబీ