
'అరేయ్ అఖిల్.. ఒసేయ్ బిందూ..' అంటూ ఒకరి మీద ఒకరు నోరు పారేసుకున్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. ఎవరూ తగ్గేదేలే అన్న రీతిలో గొడవపడ్డారు. ఈ దెబ్బతో అఖిల్, బిందు మాట్లాడుకోవడం కల్ల అనుకున్న తరుణంలో బిగ్‌బాస్ అనూహ్యంగా వాళ్లిద్దరినీ కలిపాడు. అవును, ఓ టాస్క్‌లో ఈ ఇద్దరినీ ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు.
బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు 'ఇది మా అడ్డా' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంటిని ఐదు ప్రాంతాలుగా విభజించాడు. ఇంటిసభ్యులను కూడా ఐదు టీములుగా విభజిస్తూ ఒక్కో ప్రాంతాన్ని వారికి అప్పగించాడు. అఖిల్ - బిందు, అజయ్- అరియానా, యాంకర్ శివ- నటరాజ్, అనిల్- హమీదా జంటలుగా విడిపోయారు. కెప్టెన్ అషూ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో అఖిల్- బిందు కలిసి ఆడుతూ ఎత్తుకు పైఎత్తులు వేశారు. బిందు అయితే ఏకంగా అరియానా పాస్‌లు కొట్టేసి అఖిల్ చేతిలో పెట్టింది. ఇప్పటివరకు వీళ్ల కొట్లాటలనే చూశాం, మరి వీరి గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: ఆస్కార్ విన్నర్ నిర్మాత నిశ‍్చితార్థం.. ఎమోషనల్‌గా పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment