ఈసారి 'నాన్‌స్టాప్' ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్తగా ముందుకు వచ్చింది బిగ్‌బాస్. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా ప్రారంభమైందీ షో. ఈసారి కొత్త కంటెస్టెంట్లే కాకుండా మాజీలు సైతం రంగంలోకి దిగారు. అందులో రన్నరప్ అఖిల్‌తో పాటు అరియానా, తేజస్వి, అషూ, మహేశ్ విట్టా, నటరాజ్ మాస్టర్, సరయు, హమీదా, ముమైత్ ఖాన్ ఉన్నారు. వీరంతా వారియర్స్ టీమ్‌లా ఏర్పడగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చైతూ, బిందుమాధవి, మిత్ర శర్మ, శ్రీరాపాక, అజయ్, అనిల్, శివ, స్రవంతి చాలెంజర్స్ టీమ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆటల్లో దాదాపు వారియర్స్‌దే పైచేయి అవుతూ వస్తోంది. దీంతో చాలెంజర్స్ ఎలాగైనా వారియర్స్‌ను ఓడించాలని కసిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కంటెస్టెంట్లు వారి వ్యక్తిగత విషయాలను హౌస్‌మేట్స్‌తో పంచుకోవాలనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా 'ఆవకాయ బిర్యానీ' హీరోయిన్ బిందుమాధవి తన లవ్ లైఫ్‌ను వివరించింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇద్దరం ప్రేమించుకున్నామని, కానీ కెరీర్ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని తెలిపింది. అతడు పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోగా తాను నటన మీదున్న ఆసక్తితో సినీరంగంలోకి వచ్చేశానని పేర్కొంది. అయితే ఇప్పటికీ ఆ రిలేషన్ తనకెంతో స్పెషల్ అన్న బిందు ప్రియుడి పేరును మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, అతడికి పెళ్లి కూడా అయిపోయిందని తెలిపింది.
కాగా ప్రియుడితో బ్రేకప్ అయిన సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని గతంలో బిందు బిగ్‌బాస్ స్టేజీ మీదే చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో తమిళ బిగ్‌బాస్ నుంచి ఆఫర్ రావడంతో షోకి వెళ్లగా.. ఆశ్చర్యంగా కొన్నిరోజుల్లోనే డిప్రెషన్ నుంచి బయటపడినట్లు చెప్పింది. ఇప్పుడు తెలుగులోనూ ఛాన్స్ రావడంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నాన్‌స్టాప్ షోలో అడుగుపెట్టింది బిందుమాధవి.
Comments
Please login to add a commentAdd a comment