Bigg Boss Non Stop: Mahesh Vitta Love Story - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: ప్రపోజ్‌ చేసిన రెండేళ్లకు ఓకే చెప్పింది, సెప్టెంబర్‌లో మా పెళ్లి: మహేశ్‌

Published Thu, Mar 3 2022 9:23 PM | Last Updated on Fri, Mar 4 2022 8:44 AM

Bigg Boss Non Stop: Mahesh Vitta Love Story - Sakshi

ఒక్క ఛాన్స్‌ అంటూ సినిమాల్లో అవకాశాల కోసం రేయింబవళ్లూ కష్టపడిన మహేశ్‌ విట్టా ఇప్పుడు సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. తన యాసతో, కామెడీతో ప్రేక్షకులను అలరించిన మహేశ్‌ విట్టా గతంలో బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్నాడు. తాజాగా అతడు మరోసారి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో అడుగుపెట్టాడు. అయితే షోలోకి వెళ్లేముందు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు మహేశ్‌.

'నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉంటున్నాం. ఎంత గొడవపడ్డా వెంటనే కలిసిపోతాం. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఆమె నా చెల్లెలి స్నేహితురాలు. తను ఐటీలో ఉద్యోగం చేస్తుంది. రెండుసార్లు చూసినప్పుడు మా అమ్మ ఫేస్‌కట్‌ ఉందనిపించింది. వెంటనే ప్రపోజ్‌ చేశాను. పరిచయమవగానే ప్రపోజ్‌ ఏంటి? పో అంది. సరే ఫ్రెండ్స్‌గా ఉందామన్నాను. రెండేళ్ల తర్వాత ప్రేమకు ఓకే చెప్పింది. గతేడాది మా ఇద్దరి ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. నా సినిమా రిలీజయ్యాక ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వివాహం చేసుకుంటాను' అని చెప్పుకొచ్చాడు మహేశ్‌ విట్టా. బిగ్‌బాస్‌ ఓటీటీ గురించి మాట్లాడుతూ.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టే వస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement