Bigg Boss Telugu Non Stop: బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌కు శనివారంతో ఎండ్‌కార్డ్ పడింది. బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ విన్నర్‌గా బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో చివరి రోజు వరకు బిందు మాధవి, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, అరియాన గ్లోరీ, బాబా భాస్కర్ మాస్టర్, మిత్ర శర్మ టైటిల్ కోసం పోరాడగా.. చివరకు బిందు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే హౌజ్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ హావా మామూలుగా ఉండదు. వారి ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చి తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు నీరాజనాలు పలుకుతుంటారు.
చదవండి: 'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు?
ఈ సందర్భంగా వారి ఫ్యాన్స్ చేసే రచ్చ, హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ సెట్ నుంచి ఇంటి వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. అలాగే హౌజ్ నుంచి బయటకు వచ్చిన యాంకర్ శివ కోసం అతడి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. దీంతో శివ ఓపెన్ టాప్ కారులో తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. ఈ క్రమంలో శివ ఫ్యాన్స్ కారు వద్దకు చేరి నానా హంగామా చేశారు. కారు చూట్టు ముట్టి కారును ముందుకు కదలకుండా చేశారు. అంతేకాదు పెద్ద ఎద్దున అరుస్తూ రచ్చ చేశారు. దీంతో ఆ ఎరియాలో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది.
చదవండి: ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే..
శివ కారు కారణంగా వెనకాలే వచ్చు కార్లు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి యాంకర్ శివకు క్లాస్ పీకారు. ఇలా కార్ టాప్ మీదకు రావడం కరెక్ట్ కాదని, మీరు లోపల కూర్చొని ఇక్కడి నుంచి వెళ్లాలని ఓ మహిళ పోలీసు అధికారిని శివను వారించారు. అంతేకాదు మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని, తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు శివను వారించినట్లు సమాచారం. దీంతో యాంకర్ శివ కారు లోపల కూర్చొని వెళ్ళిపోయాడు. కాగా గతంలోనూ పలువురు కంటెస్టెంట్స్ ఇలాగే రచ్చ చేయడంతో పోలీసులు వారిని మందలించిన సంగతి తెలిసిందే. పర్మిషన్ లేకుండా ఇలాంటి ర్యాలీలు చేపడితే ఊరుకోమని పోలీసులు పేర్కొన్నారు.
AnchorShiva craze ea verabba 😎
— Shiva Fans Ikkada ⚡🔥❤️🥷 (@iamkundum) May 21, 2022
Anchor Shiva on the way home 🏡@anchor_shiva #AnchorShiva #BiggBossNonStop #BiggBossNonStopTelugu pic.twitter.com/Z5GsaDBb9Q
Comments
Please login to add a commentAdd a comment