
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో రసవత్తరంగా మారింది. అటు వారియర్స్, ఇటు చాలెంజర్స్.. తగ్గేదే లే అన్న రేంజ్‌లో ఆడుతున్నారు. గాయాలవుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా ప్రత్యర్థుల మీదకు దూకుతున్నారు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మొదటి లెవల్‌లో వారియర్స్ స్మగ్లర్లుగా, చాలెంజర్స్ పోలీసుల్లా మారగా రెండో లెవల్‌లో వారి పాత్రలు తారుమారయ్యాయి. దీంతో వారియర్స్‌కు చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యారు చాలెంజర్స్. ఈసారి ఎలాగైనా గేమ్ గెలవాలనుకున్న వీళ్లు తమకు తోచిన ప్లాన్లన్నీ అమల్లో పెట్టినట్లు కనిపిస్తోంది.
మరోపక్క ఇదే గేమ్‌లో గాయపడ్డ రాపాక అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. తన దగ్గరున్న బొమ్మలను సరయుపైకి విసిరేయడంతో ఆమె తలకు చేతులు పట్టుకుని కూలబడిపోయింది. అక్కడే ఉన్న అఖిల్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అని ఆమె మీదకు ఫైర్ అయ్యాడు. ఇక స్రవంతి స్విమ్మింగ్ పూల్‌లో దూకడంతో అందరూ వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హెల్త్ బాగోలేనప్పుడు దూకడం ఎందుకు? అన్న సరయు మీద అరిచినంత పని చేసింది స్రవంతి. నా ఆరోగ్యపరిస్థితి గురించి తెలియకుండా మాట్లాడకు అంటూ సరయు మీద ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. మొత్తానికి సరయు మీద హౌస్‌లో నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యతిరేకతకు చెక్ పెట్టే ప్రయత్నం చేయకపోతే అది ఆమె ఎలిమినేషన్‌కు కూడా దారి తీయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment