Bigg Boss Telugu OTT: RJ Chaitu Spits Water on Ashu Reddy, Details Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: అషూ మీద నీళ్లు ఉమ్మేసిన చైతూ, షాకైన హౌస్‌మేట్స్‌

Published Mon, Feb 28 2022 4:00 PM | Last Updated on Mon, Feb 28 2022 4:57 PM

Bigg Boss Telugu OTT:  RJ Chaitu Spits Water on Ashu Reddy, Details Inside - Sakshi

బిగ్‌బాస్‌ ప్రారంభమై మూడు రోజులయ్యిందో లేదో ఆట మొదలుపెట్టేశారు కంటెస్టెంట్లు. వారికి వారే టాస్కులు ఇచ్చుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు. దీంతో బిగ్‌బాస్‌ వీరికో చాలెంజ్‌ విసిరాడు. సీనియర్స్‌లా భావిస్తున్న వారియర్స్‌కు షాకిస్తూ చాలెంజర్స్‌కు ఆధిపత్యం చెలాయించే అవకాశమిచ్చాడు. ఛాలెంజర్స్‌ అనుమతి లభించిన ఒక వారియర్‌ మాత్రమే బెడ్రూమ్‌లో నిద్రపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. అంతేకాదు, వారియర్స్‌కు సంబంధించిన లగేజ్‌ నుంచి ఒక్కో వారియర్‌ ఐదు వస్తువులు మాత్రమే తీసుకోవాలని, అవి తీసుకోవడానికి చాలెంజర్స్‌ అనుమతి పొందాలని మెలిక పెట్టాడు.

చాలెంజర్స్‌ భోజనం చేశాక వారియర్స్‌ విందు ఆరగించాలని కండీషన్‌ పెట్టాడు. వారియర్స్‌ అందరూ మాజీ కంటెస్టెంట్లే కాబట్టి వారికి హౌస్‌ను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలన్న అవగాహన ఉంటుంది. దీంతో ఇంటి పనులన్నీ వారియర్స్‌కే అప్పజెప్పాడు. ఒకవేళ పనులు చేయకపోతే జూనియర్స్‌ అయిన చాలెంజర్స్‌ వారిని శిక్షించవచ్చన్నాడు.  ఇక వారియర్స్‌తో సేవలు చేయించుకునే అవకాశం ఉండటంతో చైతూ అషూను ఓ ఆటాడుకున్నాడు.

మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పడంతో ఆమె బాటిల్‌లో నీళ్లు పట్టుకొచ్చింది. దాన్ని తాగించమని చైతూ అడగడంతో ఆమె అలానే తాగించింది. అలా తాగిస్తున్న క్రమంలో చైతూ నోట్లో ఉన్న నీళ్లను ఊసేయడంతో అవి అషూ మీద పడ్డాయి. ఈ చర్యతో అక్కడున్న హౌస్‌మేట్స్‌ ఒక్కసారిగా షాకయ్యారు. నోట్లో నీళ్లు ఎక్కువవడం వల్ల అలా ఊసేశానని చైతూ క్లారిటీ ఇవ్వడంతో అషూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే చైతూ కావాలనే అలా చేశాడంటూ నెట్టింట ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement