
బిగ్‌బాస్ షో చివరకు చేరుకుంటోంది. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో ఎమోషన్స్‌తో నిండిన బిగ్‌బాస్ హౌజ్ గతవారం మాజీ కంటెస్టెంట్స్ సడెన్ విజిట్‌తో సందడిగా మారింది. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్‌లో అశు రెడ్డి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ అనంతరం ఆ కంటెస్టెంట్ మనసులో మాటలను బయట పెట్టించే బిగ్‌బాస్ బజ్ ఎపిసోడ్‌లో అశు పాల్గొంది. ఈ సందర్భంగా రవి అశును ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడిగినట్టు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఎలిమినేషన్ అనంతరం బిగ్‌బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్న అశును వచ్చి రాగానే సైటర్‌తో ఏడిపించాడు రవి.
ఎలిమినేట్ అయినందుకు బాధగా ఉన్నా.. తనకు కంగ్రాట్స్ చెప్పాలని ఉందంటాడు. దానికి అశు ఎందుకని ప్రశ్నించగా.. ఎప్పుడో బయటకు రావాల్సిన నువ్వు ఇప్పుడోచ్చావ్, గుడ్ జర్నీ అని ఆటపట్టించాడు. ఆ తర్వాత ‘నీ గేమ్ చూస్తే.. వరస్ట్ కెప్టెన్, వరస్ట్ హౌజ్‌మేట్, వరస్ట్ సంచాలక్, వరస్ట్ బిహెవీయర్ అన్ని వరస్ట్ వరస్ట్ కంప్టీట్‌గా నీకే వచ్చింది’ అంటాడు. దీనికి ఆమె మనమే కాదు మనకంటే వేదవలు ఉన్నారంటుంది. దీంతో ‘నీన్ను నువ్వు వేదవ అనుకోవడం. నాకా అర్హత లేదు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్’ అంటాడు. కొంతమందిని నామినేట్ చేయాలంటే ఆశు భయపడిందా? అని, హౌజ్‌లో ఒక్కరిదగ్గర అవసరానికి మించి అలిగావు.. వారి మీద ఏమైన స్పెషల్ ఇంట్రెస్టా? అని ప్రశ్నించాడు రవి.
ఆ తర్వాత అఖిల్ ఫొటో చూపించగా.. నామినేట్ చేస్తాను అంటూ అతడి ఫొటో తీసుకుని విరగ్గోడుతుంది. ఆ తర్వాత రవి.. ఓక సంఘటన తర్వాత గేమ్‌లో చాలా లో అయిపోయావని, మీరు ఒకే అంటే దానిపై మాట్లాడుదామనుకుంటున్నా అంటాడు. అయితే అశు దానికి సమాధానం ఇచ్చేందుకు రెడీగా లేనని అంటుంది. అయితే ఇది హౌజ్‌లో జరిగింది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామనగానే అశు ఇంటర్య్వూ మధ్యలో నుంచి వెళ్లిపోవడం కోసమెరుపు. ఇలా శాంతం ఆసక్తిగా సాగినా బిగ్‌బాస్ నాన్-స్టాప్ బజ్‌లో ప్రోమో ఆసక్తి నెలకొంది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలపై అశు ఎలా స్పందించిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment