
ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చాడు యాంకర్ శివ. బిగ్‌బాస్ షోలో అందరితో సరదాగా ఉంటూ, కామెడీ పంచుతూ, గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తనవంతు కష్టపడుతున్నాడు శివ. అతడి డెడికేషన్ చూసి టాప్ 5లో ఉండటం ఖాయం అనుకున్నారంతా. కానీ సోమవారం జరిగిన నామినేషన్‌తో శివపై వ్యతిరేకత మొదలైంది. ఇంతకీ నామినేషన్‌లో ఏం జరిగిందటారా?
బిగ్‌బాస్ హౌస్‌లో శివ ఓసారి లేడీ గెటప్ వేసుకున్న విషయం తెలిసిందే కదా! దానికి అషూనే తన జాకెట్, షాట్, జాకెట్ లోపల వేసుకునే లోదుస్తులను కూడా శివకు ఇచ్చింది. అయితే ఆ సమయంలో శివ పదేపదే షర్ట్ బటన్స్ తీసేయ్, బటన్స్ తీసేయ్ అనడం నచ్చలేదని నామినేట్ చేసింది. నీ ఉద్దేశం ఏదైనా ఉండనీ, కానీ ఆ పదాలు వాడటం ఇబ్బందికరంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అషూ చెప్పిన మాటలు విని అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అటు సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద దుమారమే నడుస్తోంది. నిజానికి ఆరోజు ఏం జరిగిందో వారి మాటల్లోనే..
బాత్రూమ్ ఏరియాలో జరిగిన సంభాషణ..
శివ: దాంతోపాటు పైన షర్ట్ కూడా కావాలి, నువ్వు నార్మల్‌గా వేస్తావు కదా!
అషూ: మరేం కావాలి?
శివ: బటన్స్ తీయ్, నీ షర్ట్ బటన్స్ తీయ్, ఆ టైప్ కావాలి
అషూ: దానికి బటన్స్ ఎందుకు తీయమంటున్నావు? ఆగు, నేనిస్తా
శివ: అహ, ఆ టైప్ కావాలని అడుగుతున్నా
అషూ: (లోదుస్తులను ఇస్తూ) నేను వేసుకుంది కూడా ఇలాంటిదే, సేమ్‌రా నిజం, ఒకసారి వేసుకుని చూడు
అషూ: అలాగే నా దగ్గర ఒక జాకెట్ ఉంది, దానితో పాటు ఒక షాట్ కూడా ఇస్తా
ఇదీ వాళ్లమధ్య జరిగిన సంభాషణ.
ఇక ఇందులో శివ బటన్స్ తీయమని అడగడం స్పష్టంగా ఉండటంతో అషూ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఒక అమ్మాయితో అలాగే మాట్లాడతావా? ఒంటి మీదున్న షర్ట్ బటన్స్ తీయమని అడగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివ ఫ్యాన్స్ మాత్రం లో దుస్తులు అనే పదాన్ని ఉపయోగించడం ఇష్టం లేకనే అలా అడిగాడని అతడిని వెనకేసుకొస్తున్నారు. అక్కడ శివ తప్పుగా మాట్లాడినట్లు ఏమీ అనిపించలేదని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: స్క్రీన్‌షాట్లున్నాయి, అంత ఈజీగా వదిలిపెట్టనంటూ నటుడి వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment