బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. ఇచట అన్ని రకాల ఎమోషన్స్ దొరుకుతాయి. వారియర్స్, చాలెంజర్స్ తగ్గేదేలే అన్నట్లుగా ఆడుతున్నారు. అయితే మార్చి 3 నాటి ఎపిసోడ్‌లో అషూ, అరియానా ఇద్దరూ చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో హర్టయిన అరియానా చెప్పుతో కొట్టడం నచ్చలేదని మాట్లాడింది. నువ్వు అలా చేశావ్ కాబట్టే తాను తిరిగి కొట్టానని చెప్పింది. దీంతో అషూ ఆమెకు సారీ చెప్పింది. ఇక అషూ తన సిగరెట్ ప్యాకెట్లు దాచిందన్న అనుమానంతో ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను దాచేశాడు యాంకర్ శివ. ఎలాగైనా తన బ్యాగ్‌ను తిరిగి రాబట్టాలనుకున్న అషూ.. 'శివ ఎలా అయిపోతున్నాడో చూడండి, సిగరెట్లు తాగకుండా ఉండలేకపోతున్నాడు, పిచ్చెక్కిపోతున్నాడు, గజతాగుబోతుగా తయారైపోతున్నాడు' అంటూ కామెంట్రీ మొదలు పెట్టడంతో శివ వెంటనే లేచి ఆమె బ్యాగును అప్పజెప్పాడు.
ఆ తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. వారియర్స్ గతంలో బిగ్‌బాస్ షోకు వచ్చినప్పడు చేసిన పొరపాట్లు ఏంటి? వాటి నుంచి నేర్చుకున్న గుణపాఠాలేంటో చెప్పాలన్నాడు. ఇందులో భాగంగా అఖిల్ మాట్లాడుతూ.. తనెక్కువగా నవ్వలేదని, దానివల్లే గెలవలేకపోయానని చెప్పుకొచ్చాడు. మోనాల్‌తో ఉన్న బంధం వల్లే గెలవలేదని బయట టాక్, దీనికేమంటావని యాంకర్ శివ ప్రశ్నించాడు. మోనాల్‌తో ఫ్రెండ్‌షిప్ వల్ల వెనకబడిపోయానంటే ఒప్పుకోను, ఆమెతో స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అఖిల్. తర్వాత అరియానా మాట్లాడుతూ.. ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడతానని చెప్పుకొచ్చింది. గతంలో నేర్చుకున్న గుణపాఠాల వల్ల ఇప్పుడు అందరినీ అంత ఈజీగా నమ్మలేనని తెలిపింది తేజస్వి.
వేరే వాళ్లు ఎక్కువ రోజులు ఉండేందుకు నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి పంపించేయాలనుకున్నారంటూ పరోక్షంగా వితిక- వరుణ్‌ల మీద ఫైర్ అయ్యాడు మహేశ్. ఇంతకుముందు వచ్చినప్పుడు బిగ్‌బాస్ షోను చాలా లైట్ తీసుకున్నానంటూ అషూ ఉపన్యాసం మొదలు పెట్టిందో లేదో మధ్యలో తేజస్వి కల్పించుకోవడంతో వీరిమధ్య గొడవ రాజుకుంది. అనంతరం వారియర్స్ టీమ్‌లో నుంచి మరో ఇద్దరిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎన్నుకోమని ఆదేశించగా మెజారిటీ సీనియర్లు అఖిల్, అరియానా పేర్లు చెప్పారు. దీంతో తొలివారం కెప్టెన్సీ కోసం మహేశ్, తేజస్వి, సరయు, నటరాజ్‌తో పాటు వీరిద్దరూ పోటీపడ్డారు. ఎంత ప్రెషర్ పెట్టి ఆడుతున్నా మోటివేషన్ లేకపోయేసరికి నిరాశగా అనిపిస్తోంది. ముమైత్, మహేశ్ తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు అని బాధపడింది. అర్ధరాత్రి లైట్లు ఆర్పేశాక తనలో తనే కుమిలిపోతూ ఏడ్చేసింది. ఫైనల్‌గా మొదటి వారం తేజస్వి కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment