
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ మరో రెండు, మూడు వారాల్లో ముగిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో యాంకర్ శివ, అరియానా, అషూ రెడ్డి, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అనిల్ నామినేషన్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే ఓటింగ్‌లో అఖిల్, బిందు దూసుకుపోయారు. కాకపోతే ఈసారి బిందు కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో యాంకర్‌శివ ఉన్నాడు. అనూహ్యంగా మిత్ర శర్మకు ఓట్ల సంఖ్య పెరిగినట్లు సమాచారం.
అంటే ఈ వారం అనిల్, అషూ, అరియానా డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో అషూకు అందరికంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయని లీకువీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ నుంచి పదవ వారం అషూను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపు రాత్రి నాగార్జున ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే!
చదవండి: మోస్ట్ ఎంటర్‌టైనర్ కంటెస్టెంట్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్
భర్త చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేదే? నీతూ కపూర్‌పై ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment