Bigg Boss Non Stop: Shree Rapaka Eliminated For 2nd Week From BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: కంటెస్టెంట్లపై నాగ్‌ ఫైర్‌, శ్రీ రాపాక అవుట్‌

Published Mon, Mar 14 2022 2:30 PM | Last Updated on Mon, Mar 14 2022 3:53 PM

Bigg Boss Non Stop: Shree Rapaka Eliminated For Second Week From BB House - Sakshi

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే షోలలో బిగ్‌బాస్‌ రియాలిటీ షోది అగ్రస్థానం. ఎన్నో భాషల్లో విజయవంతంగా ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీన్లు పూర్తి చేసుకుంది. ఈసారి ఆరో సీజన్‌ కంటే ముందు బిగ్‌బాస్‌ ఓటీటీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు మేకర్స్‌. టీవీలో కాకుండా కేవలం హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ప్రసారం చేస్తున్నారు. 17 మందితో మొదలైన ఈ షో ఇప్పటికే ఒకరు ఎలిమినేట్‌ అవగా నిన్నటి సండే ఎపిసోడ్‌లో మరొకరు హౌస్‌ను వీడారు.

సండే ఫండే చేయడానికి వచ్చిన నాగార్జున ఎప్పటిలాగే కంటెస్టెంట్ల తప్పొప్పులను ప్రస్తావిస్తూ వారికి చీవాట్లు పెట్టాడు. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు మాట్లాడిన యాంకర్‌ శివను షో నుంచి పంపించేసినంత పని చేశాడు. అన్నం మీద అలక చూపించిన చైతూ, బిందుమాధవిలను కూడా హెచ్చరించాడు. ఇలా హౌస్‌మేట్స్‌ ఒక్కొక్కరి మీద విరుచుకుపడ్డ నాగ్‌ తర్వాత వారితో గేమ్స్‌ ఆడించాడు. అనంతరం శ్రీరాపాక ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. ఇప్పుడిప్పుడే ఆటలో పుంజుకుంటున్న శ్రీరాపాక అప్పుడే ఎలిమినేట్‌ అవడంతో భారంగా హౌస్‌ నుంచి వీడ్కోలు తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement