
నాగార్జున హౌస్‌లోకి వెళ్లాడు. ఇప్పటివరకు టీవీలో బిగ్‌బాస్ గంటమాత్రమే చూశారు, ఇప్పుడు గ్యాప్ లేకుండా హాట్‌స్టార్‌లో చూసేయండి అని చెప్పుకొచ్చాడు..
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే షో బిగ్‌బాస్. యూట్యూబర్స్, సింగర్స్, మోడల్స్, యాక్టర్స్, యాంకర్స్, డ్యాన్సర్స్.. ఇలా అన్ని రంగాలకు చెందినవారు దాదాపు 100 రోజులపాటు ఒకే ఇంట్లో ఉండే రియాలిటీ షో. పరిచయం లేని ముఖాలతో కలిసి ఉండటం, వారికి కనెక్ట్ కావడం, గేమ్స్ ఆడటం, గొడవలు పెట్టుకోవడం.. అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి ఈ షోలో. అయితే 24 గంటలపాటు ఏం జరిగిందో చూపించకుండా కేవలం 1 గంట ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేస్తూ కంటెస్టెంట్లపై పక్షపాతం చూపిస్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు.
ఈసారి అలాంటి విమర్శలకు చెక్ పెడుతూ బిగ్‌బాస్ ఓటీటీ ట్రాక్ ఎక్కింది. నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ రేపటినుంచి హాట్‌స్టార్‌లో అలరించనుంది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రోమో కూడా రిలీజైంది. ఇందులో నాగార్జున హౌస్‌లోకి వెళ్లాడు. ఇప్పటివరకు టీవీలో బిగ్‌బాస్ గంటమాత్రమే చూశారు, ఇప్పుడు గ్యాప్ లేకుండా హాట్‌స్టార్‌లో చూసేయండి అని చెప్పుకొచ్చాడు.
Starts Tomorrow @ 6:00 pm#BiggBossNonStop filled with Nonstop fun and full of entertainment @DisneyPlusHSTel
— starmaa (@StarMaa) February 25, 2022
Add to your watchlist @DisneyPlusHS https://t.co/81KGHg75Ph