Bigg Boss OTT Telugu Non Stop Grand Finale Episode Today Full Of Entertainment - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu Non Stop: గ్రాండ్‌ ఫినాలేకు స్పెషల్‌ గెస్టులు ఎవరంటే?

May 21 2022 1:26 PM | Updated on May 22 2022 1:58 PM

Bigg Boss OTT Telugu Non Stop Grand Finale Episode Today Full Of Entertainment - Sakshi

స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చిన అనిల్‌ రావిపూడి ఓ సూట్‌కేసుతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు. అంటే హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరో ఒకరు ఆ సూట్‌కేసును తీసుకునే అవకాశాలున్నాయి. అయితే పది లక్షల వరకు డబ్బున్న ఆ సూట్‌కేసును అరియానా గ్లోరీ ఎగరేసుకుపోయిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

బిగ్‌బాస్‌ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రాండ్‌ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం హౌస్‌లో బాబా భాస్కర్‌, అరియానా, అనిల్‌, మిత్ర శర్మ, అఖిల్‌, బిందు మాధవి, యాంకర్‌ శివ ఉన్నారు. ఇలా ఏడుగురు కంటెస్టెంట్లు ఫినాలేకు చేరుకోవడం తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇదే తొలిసారి. కాగా నేడు (మే 21) సాయంత్రం గ్రాండ్‌ ఫినాలే జరగనున్నట్లు హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్‌ చేసింది. ఇందులో గ్రాండ్‌ ఫినాలేను మరింత హుషారెత్తించేందుకు వచ్చిన మేజర్‌, ఎఫ్‌ 3 సినిమా టీమ్స్‌ స్టేజీపై సందడి చేశాయి. బిగ్‌బాస్‌ ఓటీటీలో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు సైతం స్టేజీపై సందడి చేశారు. 

స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చిన అనిల్‌ రావిపూడి ఓ సూట్‌కేసుతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు. అంటే హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరో ఒకరు ఆ సూట్‌కేసును తీసుకునే అవకాశాలున్నాయి. అయితే పది లక్షల వరకు డబ్బున్న ఆ సూట్‌కేసును అరియానా గ్లోరీ ఎగరేసుకుపోయిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి టైటిల్‌ సొంతం చేసుకుందంటూ నెట్టింట బిందుమాధవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సొంతం చేసుకోవాలన్న అఖిల్‌ ఆశలు అడియాశలయ్యాయని మరోసారి అతడు రన్నరప్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్‌ ఫినాలే సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రసారం కానుంది.

చదవండి 👉🏾 గుట్కా యాడ్‌ ఎఫెక్ట్‌: నలుగురు స్టార్‌ హీరోలపై కేసు

 ఆ నటిని పెళ్లాడనున్న రష్మిక మందన్నా మాజీ ప్రియుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement