Bigg Boss Non-Stop Telugu: Akhil Sarthak First Breakup Love Story Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: ఫోన్‌ చేస్తే బిజీ.. ఆరేళ్ల తర్వాత వేరొకరితో అలా... అఖిల్‌ బ్రేకప్‌ స్టోరీ

Published Sat, Apr 9 2022 2:02 PM | Last Updated on Sat, Apr 9 2022 7:09 PM

Bigg Boss Non Stop: Akhil First Love Breakup Story - Sakshi

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్‌లో శుక్రవారం సభ్యులంతా తమ తొలి ప్రేమ అనుభవాలను చెప్పుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. ప్రతి ఒక్కరు తమ బ్రేకప్‌ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్‌ కూడా బ్రేకప్‌ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్‌ అయ్యాడు. చిన్నప్పటి నుంచి బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్న చిన్నుతో ప్రేమలో పడ్డాడని, కానీ ఆమె వేరే వ్యక్తితో రిలేషనల్‌లో ఉండి తనకు బ్రేకప్‌ చెప్పిందని అఖిల్‌ చెప్పాడు. 

‘తను నా స్కూల్‌ ఫ్రెండ్‌. మా కాలనీలోనే ఉండేది. నేను ముద్దుగా చిన్ను అని పిలిచేవాడిని. మేమిద్దరం తిట్టుకునేవాళ్లం..కొట్టుకునేవాళ్లం.ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మేము ఎప్పుడూ లవ్ లో పడతాం అని అనుకోలేదు. మా ఫ్యామిలీల మధ్య గొడవ జరిగి రెండేళ్ల వరకు మాట్లాడుకోలేదు. ఓ రోజు పక్కవీధిలోకి రమ్మని పిలిచి లెటర్‌ ఇచ్చింది. అది తన రక్తంతో రాసిన లెటర్‌. తన చేతికి ఉన్న గాయాలను చూసి.. నా కోసం ఇలా చెసిందా అనుకొని ప్రేమలో పడిపోయా. చాలా కాలం మేం ప్రేమలో ఉన్నాం. ఆమె ఇంజనీరింగ్‌లో జాయిన్‌ అయింది. ఈ నాలుగేళ్లు కూడా మనం ఇలానే ఉంటే.. మనది నిజమైన లవ్‌ అని చెప్పా. తను లాస్ట్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు.. నేను షూటింట్‌లతో బిజీ అయిపోయా. అయినా కూడా క్షణం తీరిక దొరికినా తనకు మెసేజ్‌ చేసేవాడిని.

ఓ రోజు సాయంత్రం ఫోన్‌ చేస్తే.. బిజీ వచ్చింది. ఆ రోజంతా  ఎన్నిసార్లు చేసినా బిజీ వస్తునే ఉంది. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ ఫోన్‌ చేసి ఎవరితో మాట్లాడుతున్నావ్‌ అని అడిగాను. డాడితో మాట్లాడిన అని అబద్దం చెప్పింది. హాస్టల్‌కి మీ ఇంటికి దగ్గరే కదా.. ఇంటికెళ్లి మాట్లాడొచ్చుగా అని అడిగితే.. నాపై నమ్మకం లేదా అని సీరియస్‌ అయింది. ఇలా ఉంటే కష్టం అని అన్నందుకు అదే మాటని రిపీట్‌ చేస్తూ బ్రేకప్‌ చెప్పింది. బ్రేకప్‌ వద్దని చెప్పినా వినలేదు.

‘మా ఇంట్లో ఒప్పుకోరు..మీ క్యాస్ట్‌, మా క్యాస్ట్‌ వేరు. ఇండస్ట్రీకి చెందిన అబ్బాయి అంటే మా ఇంట్లో ఒప్పుకోరు’అంటూ ఆరేళ్ల తర్వాత బ్రేకప్‌ చెప్పింది. అప్పుడు నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. బ్రేకప్‌కి ముందే ఆమె  ఓ కెనడా అబ్బాయితో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని ఆమె ఫ్రెండ్‌ నాతో చెప్పడంతో నేను బ్యాక్‌ స్టెప్‌ వేశా. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆమే మళ్లీ నాకు ఫోన్‌ చేసి ‘కర్మా ఈజ్‌ బ్యాక్‌ అన్నట్టుగా.. నేను నిన్ను వదిలేస్తే.. నన్ను ఆ కెనడా అబ్బాయి వదిలేశాడు’అని చెప్పింది. అక్కడ నుంచి లవ్‌ అంటే నేను భయపడతాను. కానీ ఫస్ట్‌ లవ్‌ మ్యాజిక్‌ అనేది మళ్లీ జరగదని అనిపిస్తుంది. ఇప్పటికీ తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. నన్ను నేను స్ట్రాంగ్‌గా మార్చుకునేందుకు దోహదపడింది’అంటూ అఖిల్‌ చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement