
బిగ్‌బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ తన పేరు వెనక ఓ చరిత్ర ఉంది. అఖిల్ నటించిన సిసింద్రి చిత్రం విడుదలైన మరుసటి రోజే తాను జన్మించడంతో కుటుంబ సభ్యులు తనకు అఖిల్ అని పేరు పెట్టాడని గతంలో చెప్పుకొచ్చాడీ మోడల్.
హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అఖిల్ మూడో స్థానం సంపాదించుకున్న అఖిల్ పలు సీరియల్స్‌లోనూ నటించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఫైటర్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈసారి రన్నరప్‌గా కాకుండా కప్ గెలుచుకుని విన్నర్‌గా బయటకు వస్తానన్నాడు. దానికోసం హౌస్‌లో నిరంతరం కష్టపడ్డాడు. కానీ చివరాఖరకు బిందుమాధవితో పోటీపడలేక మరోసారి రెండో స్థానానికే పరిమితమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment