Bigg Bos OTT Non Stop: First Week Nominated Contestants List - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: బిగ్‌బాస్‌ షోలో బాడీ షేమింగ్‌, నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

Published Mon, Feb 28 2022 12:19 PM | Last Updated on Mon, Feb 28 2022 1:28 PM

Bigg Bos OTT Non Stop: First Week Nominated Contestants List - Sakshi

బిగ్‌బాస్‌.. ఆరడుగుల దూరం నుంచి చూసే ఈ షో అరచేతిలో నుంచి చూసేంత దగ్గరయ్యైంది. బుల్లితెర నుంచి మొబైల్‌ ఫోన్‌లో చూసేందుకు వీలుగా ఓటీటీలోకి వచ్చేసింది. కొత్త, పాత కంటెస్టెంట్ల కలయికతో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. వచ్చీరావడంతోనే పరిచయాలే కాదు పోట్లాటలు కూడా మొదలు పెట్టేశారు కంటెస్టెంట్లు. ఒకరినొకరు తెలుసుకునే క్రమంలో గొడవలు రాజుకుంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దీనికి నామినేషన్‌ ప్రక్రియ తోడైంది. వారియర్స్‌, చాలెంజర్స్‌ మధ్య జరిగిన నామినేషన్‌ రసాభాసగా మారింది.

ఈ ప్రక్రియలో పాల్గొన్న చైతు తనను బాడీ షేమింగ్‌ చేస్తున్నాడంటూ నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు. దాదాపు చాలెంజర్స్‌ అందరూ నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశారు. దీంతో తనను టార్గెట్‌ చేశారంటూ మాస్టర్‌ కంటతడి పెట్టుకున్నాడు. నేను అందరికీ ఆదర్శంగా నిల్చుంటానే తప్ప బాడీ షేమింగ్‌ చేయలేదంటూ మోకాలి మీద కూర్చుని ఏడ్చేశాడు. అయితే  తాను చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్‌ కామెంట్లు ఫేస్‌ చేస్తున్నా కాబట్టే తట్టుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు చైతు.

వారియర్స్‌ అందరూ ఏకాభిప్రాయంతో మిత్ర శర్మ, చైతూను నామినేట్‌ చేశారు. ఫైనల్‌గా తొలివారం నటరాజ్‌ మాస్టర్‌, సరయు, హమీదా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ, అరియానా, ముమైత్‌ ఖాన్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేషన్‌ గండం గట్టెక్కుతారు? ఎవరు వచ్చిన వారంలోనే బయటకు వెళ్లిపోతారు? అనేది చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement