Bigg Boss NonStop Second Week Nominations: ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ప్రస్తుతం ఓటీటీ వేదికగా వస్తున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా మారింది. బంధాలు, అనుబంధాలను పక్కన పెడితే కయ్యాలు, కొట్లాటలతో వేడెక్కుతోంది. కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్‌గా విడగొట్టినప్పటినుంచి బద్ధ శత్రువుల్లా ఒకరిపైఒకరు విరుచుకుపడుతున్నారు. బిగ్‌బాస్ హౌజ్ రూల్స్ పాటజ్‌ట్లేదంటూ ఒకరి బృందం మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే గతవారం ఎలిమినేషన్‌లో ముమైత్ ఖాన్ బయటకు వెళ్లిపోయింది. ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది.
చదవండి: సరయుపై శ్రీరాపాక దాడి! షాకైన హౌస్‌మేట్స్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రెండో వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురు సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. వారిలో కేవలం ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ ముగ్గురు శ్రీరాపాక, అనిల్ రాధోడ్, మిత్ర శర్మ. అయితే నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా కూడా డేంజర్ జోన్‌లో ఉండగా.. స్మగ్లర్ల టాస్క్‌లో వీరిద్దరూ బాగా రాణించడంతో ఓటింగ్ శాతం కొంచెం పెరిగిపోయింది. దీంతో ఈ ఇద్దరూ ఈసారికి బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. టాప్ ప్లేస్‌లో ఉన్న అఖిల్ సార్ధక్‌కు అరియానా గట్టి పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉండటంతో యాంకర్ శివకు ఓటింగ్ శాతం బాగానే వస్తోంది. అంతేకాకుండా బిందు మాధవితో స్నేహం కారణంగా ఆమె ఫ్యాన్స్, అలాగే షణ్ముక్ జశ్వంత్ ఫాలోవర్స్ కూడా శివకే ఓటేస్తున్నారని సమాచారం. దీంతో శివ సేఫ్ అయినట్లే. ఇక ఓటీంగ్ శాతాన్ని బట్టి చూస్తే డేంజర్ జోన్‌లో ఉన్న శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: 'తగ్గేదే లే' టాస్క్‌లో రచ్చ, కొట్టుకునేదాకా వెళ్లిన కంటెస్టెంట్లు!
Comments
Please login to add a commentAdd a comment