
అనిల్.. ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరు. ఇతడి తండ్రి, తాత కూడా పోలీసాఫీసర్. కానీ అనిల్ మాత్రం మోడలింగ్ వైపు అడుగులు వేశాడు. మొదట్లో అతడి నిర్ణయాన్ని కుటుంబసభ్యులు వ్యతిరేకించినప్పటికీ అనిల్ ఇష్టాన్ని కాదనలేక మోడలింగ్‌కు సరేనన్నారు. దీంతో తక్కువ కాలంలోనే బెస్ట్ మోడల్‌గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు అనిల్.
అంత ఈజీగా గివప్ ఇవ్వనన్న అనిల్.. నెవర్ గివప్ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగు పెట్టాడు. ప్రారంభంలోనే అతడికి అమ్మాయితో ముడిపెట్టేందుకు ప్రయత్నించాడు బిగ్‌బాస్. లిప్‌స్టిక్ పెదాలు ఉన్న ఓ కార్డు పట్టుకుని అది ఏ అమ్మాయిదో గుర్తించాలని మెలిక పెట్టాడు. మరి అతడు ఆ లిప్‌స్టిక్ ఎవరిదో కరెక్ట్‌గా కనుక్కుంటాడా? ఈ మోడల్ గేమ్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది!
Comments
Please login to add a commentAdd a comment