Bigg Boss Non Stop Promo: Raj Tarun, Varsha Bollamma In BB House Deets Here - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: అంత బలుపెందుకు? అంటూ హీరోను తిట్టేసిన అరియానా

Published Sat, Mar 12 2022 9:13 PM | Last Updated on Mon, Mar 14 2022 4:48 PM

Bigg Boss Non Stop Promo: Raj Tarun, Varsha Bollamma In BB House - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన షోలో ఇప్పటికే ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ కాగా తాజాగా మరో కంటెస్టెంట్‌ హౌస్‌ను వీడే సమయం ఆసన్నమైంది. సోషల్‌ మీడియాలో లీకువీరులు శ్రీరాపాక ఎలిమినేట్‌ అయిందని దండోరా వేస్తుండగా మరికొందరు మాత్రం మిత్రశర్మ వెళ్లిపోయే ఛాన్స్‌ ఉందంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే తాజాగా స్టాండప్‌ రాహుల్‌ చిత్రయూనిట్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టింది. రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ హౌస్‌లో అడుగుపెట్టి కంటెస్టెంట్లతో ఓ ఆటాడించారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్‌ చేశారు. ఇందులో ఈ వారం మహేశ్‌ విట్టా వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎంపికై జైలులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అతిథులుగా వచ్చిన హీరోహీరోయిన్లను హౌస్‌మేట్స్‌ తమ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించి ఇంప్రెస్‌ చేశారు.

కాగా రాజ్‌తరుణ్‌ అనుభవించు రాజా సినిమాలో అరియానా నటించిన విషయం తెలిసిందే! ఇక్కడ ఏర్పడ్డ పరిచయంతో హీరోతో చనువు పెంచుకున్న బోల్డ్‌ బ్యూటీ తాజాగా ప్రోమోలో రాజ్‌తరుణ్‌పై సీరియస్‌ అయింది. నీకు హాయ్‌ చెప్పడానికి బలుపేంటి? అని నిలదీసింది. రాగానే చెప్పాను కదా అని రాజ్‌తరుణ్‌ సమాధానం చెప్పినప్పటికీ ఆమె శాంతించలేదు. ఏంటి నీ ఫ్రెండ్‌ హాయ్‌ చెప్పట్లేదు అని చైతూ అప్పటినుంచి అంటున్నాడు అంటూ గరం అయింది. అయితే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి అంత సీరియస్‌ ఏం అయుండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ స్టాండప్‌ రాహుల్‌ టీమ్‌తో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల ఆటను చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ వీక్షించాల్సిందే!

చదవండి: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement