
డబ్‌స్మాష్‌తో ఫేమస్.. టిక్‌టాక్‌తో మరింత పాపులర్.. బిగ్‌బాస్ షోతో ఊహించని క్రేజ్.. ఆమె మరెవరో కాదు అషూ రెడ్డి. అభిమానులు ఆమెను ముద్దుగా జూనియర్ సమంత అని పిలుచుకుంటారు. నిత్యం ఫొటోషూట్లతో సందడి చేసే ఈ భామ ఛల్ మోహనరంగ సినిమాలోనూ మెరిసింది. పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ హోస్ట్‌గానూ మెప్పిస్తోంది. గతంలో బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న అషూ ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగింది.
అయితే ఈసారి మాత్రం ఫైనల్స్‌లో కచ్చితంగా అడుగుపెడతానంటోందీ ముద్దుగుమ్మ. ఎలాగో అషూకు బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సపోర్ట్ ఉండనే ఉంది. ఇక వచ్చేముందు కూడా రాహుల్ తనలా ఆడొద్దని, అవే స్ట్రాటజీలు వాడొద్దని సలహా ఇచ్చాడని స్టేజీ మీద చెప్పింది అషూ. అంతేకాదు నాగ్ బుగ్గపై ముద్దు పెట్టి కప్పు కొట్టినంత హ్యాపీగా ఫీలైంది. హౌస్‌లో ప్రేమ తప్ప అన్ని ఎమోషన్స్ పండిస్తానంటున్న అషూ తన గేమ్‌తో పిచ్చెక్కిస్తానంటోంది. మరి అషూ నిజంగానే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment