
యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన అరియానా పలు టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ భామకు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో పిలుపు రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తన అందచందాలతోనే కాకుండా ఆటతోనూ అభిమానులను కట్టిపడేసిన అరియానా.. తనకు తప్పనిపిస్తే బిగ్‌బాస్‌నేంటి? ఏకంగా నాగార్జునను సైతం నిలదీసింది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన అరియానా థర్డ్ రన్నరప్‌గా వెనుదిరిగింది.
ఆ తర్వాత ఐదో సీజన్ బజ్‌కు హోస్ట్‌గానూ వ్యవహరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్‌బాస్ తర్వాత జీరో ఫ్యాన్‌బేస్ నుంచి ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యానంటూ ఎగ్జైట్ అయ్యింది అరియానా. అంతేకాదు సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్లెవరో బయటపెట్టనని చెప్పింది. అయితే నాగ్ కూపీ లాగేందుకు ప్రయత్నించడంతో అలాంటిదేమీ లేదని, ఇప్పటివరకు ఎవరూ కనెక్ట్ కావడం లేదని చెప్పుకొచ్చింది. మరి అరియానా ఈసారైనా కప్పు కొడుతుందా? లేదా? అనేది చూడాలి!