
ఈయన నోరు తెరిచాడంటే ఆనకట్ట వేయడం కష్టం. అతడే ఆర్జే చైతూ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అతడు కుటుంబ పోషణ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. విజయవాడకు చెందిన చైతూ హైదరాబాద్‌కు వచ్చి డిగ్రీ చదువుతూ, యానిమేషన్స్ చేసుకుంటూనే రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆర్జేగా మారాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. ఇప్పటివరకు ఆరు జాతీయ అవార్డులు అందుకున్నాడు చైతు.
కనిపించకుండా వినిపించిన అతడు బిగ్‌బాస్ షోలో కనిపించబోతున్నాడు. అయితే తల్లికి డ్రీమ్ హౌస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు చైతు. అయితే భోజన ప్రియుడైన చైతూకు నాగార్జున చికెన్ పిజ్జాను తినిపించాడు. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు చాటర్‌బాక్స్ చైతూ. మరి ఈ ఆర్జే షోలో ఎన్నివారాలు ఉండగలుగుతాడు? అతడి వాగ్ధాటిని మిగతావాళ్లు తట్టుకుంటారో లేదో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment