
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల నిజస్వరూపాలు బయటపడేవి నామినేషన్స్‌లోనే! అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నా ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నా నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి నామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఏడోవారం నామినేషన్స్ రసవత్తరంగా మారాయి. హమీదా.. అనిల్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ ఎప్పటిలాగే ఓ రేంజ్‌లో గొడవపడ్డారు.
అటు బిందుమాధవి, అఖిల్ కూడా మరోసారి కొట్లాటకు దిగారు. స్రవంతి అనే ఎమోషన్‌ను యూజ్ చేసుకున్నావని ఫైర్ అయింది బిందు. తనకు కావాల్సినప్పుడు నువ్వు నిలబడలేదంటూ మండిపడింది. అంతటితో ఆగకుండా ఒరేయ్ అఖిల్‌గా చెప్పురా.. అనడంతో అక్కడున్నవాళ్లు ముక్కున వేలేసుకున్నారు. తనను అంతమాట అన్నాక అఖిల్ ఆగుతాడా? ఒసేయ్ బిందు.. ఏం చెప్పాలే నీకు అని రివర్స్ కౌంటరిచ్చాడు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో అఖిల్, బిందుమాధవి, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, మిత్ర, అనిల్ శర్మ నామినేషన్స్‌లో నిలిచారు. అషూ తన కెప్టెన్సీ పవర్‌తో మహేశ్‌ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: ఆ ఐదుగురికి హగ్, ఒక్కరికి మాత్రం పంచ్ ఇచ్చిన స్రవంతి
Comments
Please login to add a commentAdd a comment