బిగ్‌బాస్ ఓటీటీ రంజుగా సాగుతోంది. హౌస్‌మేట్స్ చేసిన తప్పులకు కెప్టెన్ అనిల్ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇంటిసభ్యులు పట్టపగలు నిద్రపోతున్నా చూసీచూడనట్లు వదిలేయడం, మైకులు ధరించాలన్న నిబంధనకు కొందరు నీళ్లు వదలడంతో బిగ్‌బాస్ మండిపడ్డాడు. అనిల్ తన విధులు సరిగా నిర్వర్తించలేదంటూ కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తొలగించాడు. అయితే మెజారిటీ హౌస్‌మేట్స్ అనిల్ కెప్టెన్సీ సరిగ్గానే ఉందంటూ ఓటేయడంతో రెండు వారాలపాటు కెప్టెన్సీకి నేరుగా పోటీ చేసే అవకాశాన్ని గెలుచుకున్నాడు.
దీంతో మూడోవారంలో కెప్టెన్సీ కంటెండర్స్‌లో అనిల్ కూడా ఉన్నాడు. ఇతడితో పాటు అషూ, అరియానా, శివ, చైతూ, అజయ్, హమీదా కెప్టెన్సీకి పోటీపడ్డారు. వీరిలో చైతూ గెలవగా అతడిని గెలిపించింది మాత్రం అఖిలే కావడం విశేషం. మరోపక్క అషూ కెప్టెన్ కాలేకపోయానని కంటతడి పెట్టుకుంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అఖిల్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 'అఖిల్ గేమ్‌లో దిగితే వేరే విషయాలు, గొడవలు పట్టించుకోడు', 'చైతూ అఖిల్‌ను సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేసినా అతడు అవేమీ పట్టించుకోకుండా కెప్టెన్ అవడానికి సాయం చేశాడు', 'అఖిలే నంబర్ 1' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment