
బిగ్‌బాస్ షోలో ఈరోజు విచిత్రం జరగబోతోంది. సందు దొరికితే చాలు కారాలు మిరియాలు నూరుకునే కంటెస్టెంట్లు ఈరోజు మాత్రం ఒకరిపై ఒకరు ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఇంట్లో ఉన్న పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరో తెలుసుకోమని చెప్తూనే వారిని ఫిదా చేయాలంటూ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో కంటెస్టెంట్లు వారి కోపాలను పక్కనపెట్టి ఇతర హౌస్‌మేట్స్‌ను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ముమైత్ అజయ్ కోసం సిగరెట్ తాగడం మానేస్తానంది. అరియానా మహేశ్‌కోసం ఆమ్లెట్ చేయడమే కాక స్వయంగా తినిపించింది. మరోపక్క శివను కాకా పట్టే పనిలో పడింది హమీదా.
ఇదిలా ఉంటే బిగ్‌బాస్ వీరికి మరో టాస్క్‌ను సైతం ఇచ్చాడు. తొలి ప్రేమ అనుభవాలను పంచుకోమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. బిందుమాధవి మాట్లాడుతూ.. తన ఫస్ట్ లవ్ స్టోరీ బ్రేకప్‌తో ముగిసిపోయిందని చెప్పింది. స్రవంతి.. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి వచ్చేశానని, కానీ ఇంటికెళ్దాం అనుకునేలోపే అమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చిందంటూ ఏడ్చింది. మరి వారి లవ్ స్టోరీలు తెలుసుకోవాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: అకీరా బాక్సింగ్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్, అవి నమ్మొద్దని విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment