
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రారంభమై అప్పుడే ఆరు వారాలు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరిలో తొలివారంలోనే ఎలిమినేట్ అయిన ముమైత్ గతవారమే రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ వారం మిత్ర శర్మ, నటరాజ్, మహేశ్ విట్టా, అషూ రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్ నామినేషన్‌లో ఉన్నారు. ఈ పది మందిలో ముమైత్ ఖాన్, స్రవంతి, మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయని, ఈ ముగ్గురే డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాకరాక నామినేషన్‌లోకి వచ్చిన స్రవంతిని, వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ముమైత్‌ను ఇంటి నుంచి బయటకు పంపుతున్నారంటూ లీకువీరులు దండోరా వేస్తున్నారు. ఇక ప్రతివారం నామినేషన్‌లో ఉంటూ వస్తున్న మిత్రశర్మ పెద్దగా గేమ్ ఆడకపోయినా సేవ్ అవుతూ వస్తుండటం గమనార్హం. ఈసారి కూడా ఆమె ఎలిమినేట్ అయ్యేట్లు కనిపించడం లేదు. ఫలితంగా నిజంగానే ముమైత్, స్రవంతి బ్యాగు సర్దేసుకుని బయటకు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపు నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు ఎదురు చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment