![Bigg Boss Non Stop Eviction: Mumaith Khan, Sravanthi Step Out From BB Show - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/10/bigg-boss123.jpg.webp?itok=KwT6lDAP)
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఆరోవారం ఎలిమినేషన్ జరిగింది. ఈసారి డబుల్ ఎలిమినేషన్‌తో సర్‌ప్రైజ్ చేశాడు నాగ్. ఈ వారం నామినేషన్‌లో పది మంది ఉండగా అందులో ముమైత్ ఖాన్, స్రవంతిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు. అయితే దీనికంటే ముందు నటరాజ్ మాస్టర్, యాంకర్ శివపై మండిపడ్డాడు నాగ్.
లుంగీ ఎత్తుతూ నటరాజ్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం తప్పని శివను హెచ్చరించాడు నాగార్జున. అలాగే నోటికొచ్చినట్లు మాట్లాడటం కూడా తప్పంటూ నటరాజ్‌ను మందలించాడు. అనంతరం అషూ డ్రెస్‌ను బాత్‌రూమ్‌లో కిందపడేసి తొక్కిన శివ వీడియోను ప్లే చేసి చూపించాడు. ఆ పని చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ అతడికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని బిందుమాధవిని అడిగాడు. అలా చేయడం తప్పని చెప్పిన బిందు వారం రోజులవరకు అమ్మాయిల బట్టలు ఉతకాలని చెప్పింది. దీంతో ఇదే శిక్షను ఫైనల్ చేశాడు నాగ్. అనంతరం స్రవంతి, ముమైత్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.
స్రవంతి వెళ్లిపోతుంటే బిందుమాధవి ఏడ్చేసింది. ఆమె కంట్లో నుంచి మొదటిసారి కన్నీళ్లు చూస్తున్నానన్నాడు నాగ్. మరోవైపు స్రవంతి.. షోలో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కన్నా అఖిల్, అజయ్‌ను మిస్ అవుతున్నానన్న బాధే ఎక్కువగా ఉందని ఎమోషనలైంది. అనంతరం తన పర్సనాలిటీని కించపరచడం నచ్చలేదంటూ నటరాజ్ మాస్టర్‌కు పంచ్ ఇచ్చింది. ఎవరిని హగ్ చేసుకుంటావు అన్న ప్రశ్నకు అఖిల్ పేరును చెప్తూ ఏడ్చేసింది. అలాగే అజయ్, అషూ, బిందు మాధవి, అరియానాలకు హగ్ ఇచ్చి వీడ్కోలు తీసుకుంది.
చదవండి: కిరాక్ ఆర్‌పీ ఇల్లు చూశారా? లిఫ్ట్, హోమ్ థియేటర్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి!
చూడకూడని స్థితిలో బావను చూశాను, విడిపోదామనుకున్నా: ఏడ్చేసిన అరియానా
Comments
Please login to add a commentAdd a comment