Bigg Boss Non Stop Telugu: Mumaith Khan Remunaraion For 1 Week Deets Inside - Sakshi

Bigg Boss Non Stop Telugu: ఒక్క వారానికి ముమైత్‌ ఎంత తీసుకుందంటే..

Mar 9 2022 4:53 PM | Updated on Mar 9 2022 8:00 PM

Bigg Boss Non Stop Telugu: Mumaith Khan Remunaraion For 1 Week - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి తొలివారం ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. వారియర్స్ టీమ్‌ కంటెస్టెంట్ అయిన ముమైత్కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌ను వీడాల్సి వచ్చింది. అయితే ఆమె ముందునుంచి భయపడ్డట్టే జరిగింది. హౌజ్‌లో అడుగుపెట్టిన మరు క్షణం నుంచి ముమైత్‌ తీరు గమనిస్తే ఆమె ఆట మీద కంటే.. నామినేషన్స్‌ ఎలిమినేషన్‌ మీదే ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో ఆమె ప్రతి ఒక్కరి దగ్గర సింపతి గేన్‌ చేసే పనిమీదే ధ్యాస ఉంచినట్లు కనిపించింది. ఇలా బయటికి వచ్చిన ముమైత్‌.. తాను ఇంత తొందరగా బయటకు వస్తానని ఊహించలేదంటూ స్టేజ్‌పైనే ఎమోషనల్‌ అయ్యింది. 

చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్‌.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి?

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌లో ముమైత్‌ ఖాన్‌ రెమ్యునరేషన్‌ హాట్‌టాపిక్‌ మారింది. దీంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆమెకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు పారితోషికం ఎంత ఇచ్చారా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక్క వారానికి రూ. 80 వేలు పారితోషికం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దిన్ని బట్టి చూస్తే ఆమె రెమ్యునరేషన్ లక్ష రూపాయల లోపే ఉండవచ్చని సమాచారం. ఇక షో నుంచి బయటకు వచ్చేముందు హౌజ్‌‌లో విలువైన వ్యక్తులు(వర్తీ), పనికిరాని వాళ్లు(వేస్ట్‌) అనే ట్యాగ్ ఎవరికీ ఇస్తావని హోస్ట్‌ నాగార్జున అడగ్గా.. అఖిల్‌, అజయ్‌, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్‌ ట్యాగ్‌ ఇస్తానని ముమైత్ తెలిపిన సంగతి తెలిసిందే. 

చదవండి: నేను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్‌ కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement