Bigg Boss Non Stop, Episode 13: Mumaith Khan Eliminated First Week Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: ఫస్ట్‌ వీక్‌లోనే ఎలిమినేట్‌, వాళ్లంతా వేస్ట్‌ అన్న ముమైత్‌

Published Mon, Mar 7 2022 2:16 PM | Last Updated on Mon, Mar 7 2022 2:59 PM

Bigg Boss Non Stop, Episode 13: Mumaith Khan Eliminated First Week - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షోలో మొదటి వారం ఎలిమినేషన్‌ జరిగింది. సరయు, మిత్ర శర్మ కాకుండా ఊహించని కంటెస్టెంట్‌ ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అయింది. సండే ఫండే ఎపిసోడ్‌లో నాగార్జున ఆమెను దగ్గరుండి బయటకు పంపించాడు. మరి ఆ సంగతులేంటో మార్చి 7 నాటి కథనంలో చూసేయండి..

సండేను ఫండే చేసేందుకు నాగార్జున హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్‌ ఆడించాడు. అందులో భాగంగా రెండు టీములతో డ్యాన్సులు కూడా చేయించాడు. ఈ పోటీ వారియర్స్‌, చాలెంజర్స్‌ పోటీపడి స్టెప్పులేశారు. బిగ్‌బాస్‌ మొదలై వారం రోజులైతున్న సందర్భంగా అందరి మనసులో ఏముందో అడిగి తెలుసుకున్నాడు. అలాగే మహేశ్‌ విట్టా పెళ్లి గురించి ఆరా తీయగా.. అతడు మాట్లాడుతూ.. మా రిలేషన్‌కు ఐదేళ్లు. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ వస్తూనే ఉన్నాయి. ఈ కరోనా తగ్గాక పెళ్లి చేసుకుందామని ఆగాం. త్వరలోనే అది కూడా జరుగుతుంది అని చెప్పాడు.

నచ్చినవాళ్లకు ఎర్ర గులాబీ, నచ్చనివాళ్లకు నల్ల గులాబీ ఇవ్వాలని నాగ్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో మెజారిటీ ఎర్ర గులాబీలు వచ్చిన తేజస్వికి లవ్‌ బ్యాడ్జ్‌, ఎక్కువ నల్ల గులాబీలు వచ్చిన మిత్ర శర్మకు హేట్‌ బ్యాడ్జ్‌ పెట్టారు. అనంతరం ఎలిమినేషన్‌ జోన్‌లో సరయు, ముమైత్‌ ఖాన్‌ ఇద్దరే మిగిలారు. ఈసారి కూడా ఫస్ట్‌ వీక్‌లోనే వెళ్లిపోతాననుకున్న సరయు గుక్కపెట్టి ఏడ్చేసింది. ఫైనల్‌గా ముమైత్‌ ఎలిమినేట్‌ అని ప్రకటించడంతో సరయు కిందపడి కన్నీళ్లు పెట్టుకుంది. 

నా వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడారు, అందుకే ఎలిమినేట్‌ అవాల్సి వచ్చిందని ఫైర్‌ అయింది ముమైత్‌. అప్పటిదాకా గొంతులోనే దుఃఖాన్ని ఆపుకున్న ఆమె అఖిల్‌ను హత్తుకోగానే ఏడ్చేసింది. స్టేజీపైకి వచ్చాక కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోవడంతో నాగార్జున ఆమెను ఓదార్చాడు. తర్వాత ఆమెతో నాగ్‌ టాస్క్‌ ఆడించాడు. హౌస్‌లో ఉండాల్సిన ఐదుగురు, అవసరం లేని కంటెస్టెంట్లు ఎవరో చెప్పాలన్నాడు. దీనికి ముమైత్‌.. అఖిల్‌, అషూ, తేజస్వి, అజయ్‌, అరియానా ఉండాల్సిన వారని చెప్పింది. చైతూ, శివ, మిత్ర, సరయు, బిందు మాధవి వేస్ట్‌ కంటెస్టెంట్లని చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్‌ నీ స్నేహం అంటూ పాటతో ముమైత్‌కు వీడ్కోలు పలికాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement