
అన్ని రకాల ఎమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది బిగ్‌బాస్. కోపతాపాలు, ఆనందాశ్యర్యాలు, అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు, అలకలు, అసూయలు, ఆవేశాలు, దిగులు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు హౌస్‌మేట్స్. ప్రేక్షకులు వారి గేమ్, ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని ఓట్లు గుద్దుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రారంభమై నెల రోజులు దాటిపోగా ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్ తొలివారమే ఎలిమినేట్ కాగా ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి పంపించారు. కానీ ప్రేక్షకులు ఆమెను మరోసారి ఎలిమినేట్ చేయడం గమనార్హం. నిన్నటి ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ముమైత్‌తో పాటు స్రవంతి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చింది.
చదవండి: బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర..
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మిత్ర శర్మ గురించి చెప్పుకొచ్చింది. 'బిగ్‌బాస్ హౌస్‌లో నా లైఫ్ గురించి చెప్పినప్పుడు మిత్ర ముందుకు వచ్చి రూ.5 లక్షలు ఇస్తానంది. మీరు బాధపడకండి, నా ఇంట్లో పనిచేసే అమ్మాయికి రూ.10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అలాంటిది మీరు నన్ను దగ్గరుండి చూసుకున్నారు. తినిపించారు. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా బాగోగులు చూసుకున్నారు. అమ్మలా, అక్కలా చూసుకున్నారు. మీకు రూ.5 లక్షలిస్తాను అని చెప్పింది. నేనెవరో పూర్తిగా తెలియకపోయినా మిత్ర శర్మ నాకోసం అలా మాట్లాడటం నచ్చింది. అందుకే ఆమెకు ఎక్స్‌ట్రా హగ్ ఇచ్చాను' అని తెలిపింది స్రవంతి చొక్కారపు.
Comments
Please login to add a commentAdd a comment