బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్‌లో టాప్ 5లో చోటు దక్కించుకుంది మిత్ర శర్మ. ఆమె ఫినాలేలో స్థానం సంపాదించినందుకు కొందరు సంతోషిస్తుంటే మరికొందరు ఈమె ఇక్కడిదాకా ఎలా వచ్చిందా? అని తలలు పట్టుకుంటున్నారు. బిగ్‌బాస్ షోలో ఆమె ఎక్కువగా కనిపించేది నామినేషన్స్‌లోనే. అందరి నామినేషన్ ఒక ఎత్తైతే మిత్ర నామినేషన్ మాత్రం వేరే లెవల్ ఉండేది. గంటల తరబడి వాదిస్తుంటే మిగతావాళ్ల కాళ్లు నొప్పులు పుట్టేవి.
అన్న అన్న అనుకుంటూనే మహేశ్, శివను నామినేట్ చేసింది. బిందు, శివను నామినేట్ చేసేటప్పుడు మిత్రలో మరో యాంగిల్ బయటకు వచ్చేది. ఇమిటేట్ చేయడం, డ్రామా క్రియేట్ చేయడం, గార్డెన్ ఏరియాను అంతా వాడేసుకుంటూ పరిగెత్తుతూ అరిచేస్తూ గోలగోల చేసేది. ఎదుటివారిని మాట్లాడనీయకుండా తను చెప్పాలనుకున్న విషయాలను ముక్కుసూటిగా బల్లగుద్ది చెప్పేది. నామినేషన్స్‌లో ఓ రేంజ్‌లో విరుచుకుపడే మిత్ర తర్వాత మాత్రం అసలు ఎపిసోడ్‌లో ఎక్కడో ఓ చోట కనిపించేది. ఓపక్క గొడవపడుతూనే మళ్లీ వారితో సఖ్యతగా ఉండటానికి ప్రవర్తించేది.
షో ప్రారంభంలో అయితే నోరు తెరిచి మాట్లాడేదే కాదు. తన అభిప్రాయాలను టిష్యూ పేపర్ల మీద రాసి వెల్లడించేది. ఈ ప్రవర్తనను అందరూ తప్పు పట్టడంతో అప్పటి నుంచి తన రూటు మార్చుకుంది. తనవరకు గేమ్‌లో బాగానే కష్టపడేది కానీ ఇతర హౌస్‌మేట్స్ నుంచి ఆమెకు ఎలాంటి సపోర్ట్ లభించేది కాదు. దీంతో ఎప్పుడూ తాను ఒంటరిని అని ఎక్కువగా ఫీల్ అయ్యేది. మొత్తానికి టాప్ 5లో చోటు దక్కించుకున్న మిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ అమ్మాయిగా బిందు గెలిచినందుకు సంతోషంగా ఉందంది. తన నామినేషన్స్ జనాలకు బాగా నచ్చాయని, కాబట్టి తనకు మళ్లీ ఆఫర్ వస్తే ఆరో సీజన్‌కి తప్పకుండా వెళ్తానంది. మరి నిజంగానే బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు మిత్రకు పిలుపొస్తుందా? నెక్స్ట్ సీజన్‌లో మరోసారి మిత్రను బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తామా? అన్నది వేచి చూడాలి!
చదవండి 👉🏾 బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎన్ని లక్షలు గెలుచుకుందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment