Sravanthi Chokkarapu Husband Clarity on His Sravanthi Second Marriage - Sakshi
Sakshi News home page

Sravanthi Chokkarapu: ట్రోలింగ్‌, సీక్రెట్‌ మ్యారేజ్‌పై స్పందించిన యాంకర్‌ భర్త

Published Sat, Mar 26 2022 7:25 PM | Last Updated on Sun, Mar 27 2022 9:21 AM

Sravanthi Chokkarapu Husband Reveals Marriage Details - Sakshi

చొక్కారపు స్రవంతి.. యాంకర్‌గా ఆమెను గుర్తుపడతారో లేదో కానీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. రాయలసీమలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆమెకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న స్రవంతి ఇటీవల బిగ్‌బాస్‌ ఓటీటీలో అడుగుపెట్టింది. అయితే తనకు పెళ్లైన విషయాన్ని ఎంతోకాలంగా దాచిపెట్టిన ఆమె బిగ్‌బాస్‌ స్టేజీపై మాత్రం రెండుసార్లు పెళ్లి చేసుకున్న విషయాన్ని వెల్లడించింది. ఎంతో హుషారుగా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె ఎలా గేమ్‌ ఆడుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ వెళ్లినప్పటి నుంచి ఆమె అఖిల్‌ జపం చేస్తోందే తప్ప గేమ్‌ ఆడటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా స్రవంతి భర్త ప్రశాంత్‌ ఈ ట్రోలింగ్‌పై, రహస్య వివాహంపై స్పందించాడు. 

నిజానికి బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ సమయంలో స్రవంతికి ఆఫర్‌ వచ్చింది కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో తను వెళ్లలేదన్నాడు. ఇంతకుముందు తాను బిజినెస్‌ చేసేవాడినని, కానీ స్నేహితులను నమ్మి మోసపోవడంతో అందులో చాలా నష్టాలు వచ్చాయన్నాడు. అప్పటికే స్రవంతి, తాను ప్రేమలో ఉన్నామని, బిజినెస్‌లో నిండా మునిగిన సమయంలో స్రవంతి ఫోన్‌ చేసి ఇంట్లో పెళ్లంటున్నారు, ఏం చేయాలని భయపడిపోయిందన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆమెను ఇంట్లో నుంచి వచ్చేయమని చెప్పి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. పెళ్లి తర్వాత ఆమెను హాస్టల్‌లో ఉంచానని, కొన్నాళ్లకు అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నామని తెలిపాడు.

ఇక బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాక లేడీ క్లబ్‌లో ఉంటుందనుకున్నాను, కానీ అఖిల్‌, అజయ్‌లతో కలిసిపోయిందన్నాడు. ఆమె విన్నర్‌ అయి రావాలని కోరుకున్నాడు. ఫిట్టింగ్ మాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారని, కానీ అక్కడ గేమ్‌ ఆడుతున్నవాళ్లకి స్రవంతి అంటే ఏంటో తెలుసని, ఆమె ఇప్పుడు గేమ్ మొదలుపెడుతుందని చెప్పుకొచ్చాడు. అక్కడ వాతావరణం స్రవంతికి ఇంకా కొత్తగానే ఉంది.. ఇప్పుడు ఆమె గేమ్‌లో పుంజుకుంటుందన్నాడు.

చదవండి: రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్‌ ఫణికి తీవ్ర గాయాలు, చివరి పోస్ట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement