తొలి ప్రేమ కొందరికి తీపి గుర్తులను మిగుల్చుతే మరికొందరికి మాత్రం భారమైన జ్ఞాపకాలను వదులుతుంది. తొలి ప్రేమను చివరి మజిలీదాకా తీసుకువెళ్లడం అంత ఈజీయేం కాదు. చాలామంది ఫస్ట్ లవ్ బ్రేకప్‌తోనే ముగుస్తుంది. ఈ లిస్టులో తాను కూడా ఉన్నానంటోంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ. చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమైన ఆమె తన బావను ప్రేమించి నయవంచనకు గురయ్యానంటోంది.
'తొమ్మిదో తరగతిలోనే బావకు, నాకు మధ్య లవ్ స్టోరీ మొదలైంది. అది పదో తరగతిలో బలపడింది. చిన్నప్పటి నుంచే డాడీ లేడు. అతడు తిన్నావా? ఎలా ఉన్నావు? అంటూ నా మీద కేరింగ్ చూపిస్తుండటం నచ్చేది. అతడు విజయవాడలో, నేను తాండూరులో ఉండేవాళ్లం. ఫోన్లు మాట్లాడుకునేవాళ్లం. అతడిది డిగ్రీ అయిపోయాక తనకో జాబ్ వచ్చింది. మేము హైదరాబాద్‌లో కలిసి ఉన్నాం. రిలేషన్‌షిప్‌లో ఉండి అప్పటికే మూడేళ్లకు పైనే అయింది.
కానీ అతడికి నేను బోర్ కొట్టేశాను అన్న విషయం ఇప్పుడు అర్థమవుతోంది. ఒకరోజు ఏమైందంటే.. చూడకూడని స్థితిలో మా బావను చూశాను. కలలో కూడా అనుకోలేదు అలా జరుగుతుందని! అక్కడేం జరిగిందనేది ఈ ప్రపంచానికి కూడా చెప్పుకోలేను. అది చూశాక నా గుండె పగిలిపోయింది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. విడిపోదామనుకున్నాం కానీ తను వచ్చి సముదాయించాడు. సరేనని మళ్లీ రెండేళ్లదాకా అతడితోనే ఉన్నాను. నాకు ఆర్జే అవాలనుందని చెప్తే సరే ట్రై చేసుకో అన్నాడు. ఈ ప్రయత్నంలో నాకో అబ్బాయి పరిచయమయ్యాడు. దాన్ని అతడు అనుమానించాడు. ఇంత అనుమానిస్తుంటే నా వల్ల కాదని బ్రేకప్ చెప్పుకున్నాం.
ఆ తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో కూడా నాకు బావ రోజూ గుర్తొచ్చేవాడు. ప్లీజ్ మాట్లాడు బావా, తప్పైపోయింది బావా, మళ్లీ కలిసిపోదాం అని బతిమిలాడాను. మా అత్తమ్మను ఒప్పించి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దామనుకున్నాను. సెప్టెంబర్ 19 తెల్లవారుజామున నాలుగు గంటలకు పింక్ కలర్ పట్టు చీర తీసుకుని అత్తమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి డోర్ కొట్టాను. మా బావ తలుపు తీసి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారంటూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నాడు. అక్కడే కొద్ది దూరంలో బయట చిట్టినగర్ రోడ్డు మీద కూర్చొన్నాం. హ్యాపీ బర్త్‌డే బావ అని గిఫ్టిచ్చాను. ఈ గిఫ్ట్ తీసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది, నేను తీసుకోలేను అన్నాడు. అన్ని రోజులు నన్ను చూసుకున్నాడు, నాకోసం ఖర్చుపెట్టాడు కదా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఏదైనా కానుక ఇవ్వాలని ఉండేది కానీ అది కూడా రిజెక్ట్ అయిపోయింది. 7-8 ఏళ్ల రిలేషన్‌షిప్.. సెట్ అవలేదంతే. ఇప్పుడు బావ వచ్చినా కూడా నాకు వద్దు' అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది అరియానా.
Comments
Please login to add a commentAdd a comment