
ఏడాదికోసారి వచ్చే బిగ్‌బాస్ షో అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. అంతలా షోను ఆదరించేవారి కోసం బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు నిర్వాహకులు. ఇదివరకే పరియమున్న కంటెస్టెంట్లతోపాటు కొత్తవాళ్లను సైతం షోలోకి ఆహ్వానించి గేమ్ మొదలు పెట్టారు. అలా కొత్త, పాతల కలయికతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ మొదలైంది. మరి బిగ్‌బాస్ షోలో ఏం జరుగుతోంది? ఎవరు కెప్టెన్ అయ్యారు? చైతూకు, ముమైత్‌కు మధ్య గొడవకు కారణమేంటి? అన్న విషయాలు మార్చి 4 నాటి ఎపిసోడ్‌లో చూసేద్దాం..
స్మోకింగ్ రూమ్‌లో దమ్ము లాగుతూ ముమైత్ ఏడుస్తుండటంతో ఆమెను ఊరడించే ప్రయత్నం చేసింది అషూ. ఆమెను ఎలాగైనా నవ్వించాలనుకున్న అషూ అందుకు అఖిల్‌ను పావుగా వాడుకుంది. ఆ సీజన్‌లో ఆమె(మోనాల్)ను, ఈ సీజన్‌ను ఈమె(ముమైత్)ను ఎందుకు ఏడిపిస్తున్నావ్? అని సరదాగా కౌంటర్లు వేసింది. కానీ ఆమె మాటలకు అఖిల్ హర్టవడంతో తప్పు తెలుసుకున్న బ్యూటీ అతడికి క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ఆ బాధలో నుంచి అంత త్వరగా తేరుకోలేకపోయిన అఖిల్ మోనాల్ గుర్తొస్తోందని బాధపడ్డాడు.
తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలనుకుంటారు? ఎవరి ముఖం చూడొద్దనుకుంటారో చెప్పాలన్నాడు. మొదటగా చైతూ మాట్లాడుతూ.. బిందుమాధవి ముఖం చూస్తే రోజంతా హ్యాపీగా ఉంటుందంటూ ఆమెకు హార్ట్ సింబల్ బ్యాడ్జ్ పెట్టాడు. పొద్దున లేవగానే బిగ్‌బాస్‌తో గొడవలు పడే ముమైత్ ఖాన్ ముఖం చూడకూడదనుకుంటున్నానని అసహ్యపు ఎమోజీ ఉన్న బ్యాడ్జ్ పెట్టాడు. తర్వాత తేజస్వి ముమైత్‌కు హార్ట్ బ్యాడ్జ్, కుళ్లు జోకులేసే అజయ్ ముఖం చూడొద్దనుకుంటున్నానని అతడికి అసహ్యపు బ్యాడ్జ్ పెట్టింది.
యాంకర్ స్రవంతి.. తేజస్వికి హార్ట్ బ్యాడ్జ్, తొడపాశం పెడతానన్న అజయ్‌కు అసహ్యపు బ్యాడ్జ్ ఇచ్చింది. అషూ.. నటరాజ్ మాస్టర్‌కు హార్ట్, శివకు అసహ్యపు బ్యాడ్జ్ పెట్టింది. ఓ వైపు టాస్క్ జరుగుతుండగానే ముమైత్ ఏడుపందుకుంది. తెలుగు సరిగా రాదు కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దుతా, నాన్సెన్స్, నన్ను టార్గెట్ చేస్తున్నాడు, నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటూ చైతూ ఫైర్ అయింది ముమైత్.
పొద్దుపొద్దునే సిగరెట్ల కోసం ఏడుస్తుంది, అలా పొద్దున ఏడవకూడదని చెప్పాను. అది తప్పా? అని ఫ్రస్టేట్ అయ్యాడు చైతూ. వీళ్ల మధ్య ఇలా గొడవ కొనసాగుతున్న సమయంలోనే కెప్టెన్సీ టాస్క్ జరగ్గా ఇందులో తేజస్వి గెలిచి మొదటి కెప్టెన్‌గా అవతరించింది. తేజస్వి నటరాజ్ మాస్టర్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకుంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ కెప్టెన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పర్మినెంట్‌గా బెడ్‌రూమ్ యాక్సెస్, లగేజీ ఉంచుకునే అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారని అడగ్గా తేజస్వి.. అషూ పేరు చెప్పింది. దీంతో అషూ వారియర్స్‌తో పాటు బెడ్‌రూమ్‌లో నిద్రించే అవకాశం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment