
బిగ్‌బాస్.. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు మన అంచనాలు నిజమైనా అప్పుడప్పుడు మాత్రం బొక్క బోర్లా పడక తప్పదు. రంజుగా సాగుతున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది కొద్దిమంది కంటెస్టెంట్లే! అదేంటో కానీ, ఆ కొద్దిమందిలో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ వస్తుండటం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవగా రెండో వారం వారియర్స్‌కు టఫ్ ఫైట్ ఇస్తూ ఆడిన శ్రీరాపాక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
తాజాగా మూడో వారం కూడా చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. లీకువీరులు లీక్ చేసిన సమాచారం ప్రకారం ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడట! ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో సత్తా చూపి కెప్టెన్‌గా అవతరించిన చైతూకి ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేకపోయిందని తెలుస్తోంది. ఇతడికి ఆర్జే కాజల్, యాంకర్ శ్రీముఖి, నేహాచౌదరి సహా పలువురు సెలబ్రిటీల నుంచి మద్దతు ఉన్నప్పటికీ అతడికే తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో శివ, చైతూ ఉండగా చివరికి ఆర్జేకే అతి తక్కువ ఓట్లు పడటంతో అతడిని పంపించేసినట్లు కనిపిస్తోంది. వారియర్స్‌ను ముప్పులు తిప్పలు పెట్టిన చైతూ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? చివరి నిమిషంలో మరెవరైనా హౌస్ నుంచి బయటకు వచ్చేశారా? అన్నది రేపు తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment