Bigg Boss Non Stop Promo: Anil, Nataraj Master Says They Want Ashu Reddy Friendship - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: బయటకెళ్లాక అషూనే కావాలంటున్న కంటెస్టెంట్లు

Mar 27 2022 3:24 PM | Updated on Mar 27 2022 4:40 PM

Bigg Boss Non Stop Promo: Anil, Nataraj Master Says They Want Ashu Reddy Friendship - Sakshi

అనిల్‌.. అషూను ఫ్రెండ్‌ చేసుకుంటానంటే హమీదా మాత్రం అనిల్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేస్తానంది. సరయు అనిల్‌ను బ్రదర్‌లా ఫీల్‌ అవుతానని, అతడిని ఫ్రెండ్‌ చేసుకుంటానంది.

.

నాగార్జున వస్తున్నాడంటే చాలు హౌస్‌మేట్స్‌ ముఖాలు వెలిగిపోతాయి. కాసేపు వారి గేమ్‌ను, గొడవలను అంతా పక్కనపెట్టి నాగ్‌ ఏం చెప్తాడా? అని కుతూహలంగా ఎదురుచూస్తుంటారు. తాజాగా సండేను ఫండే చేసేందుకు ఎంట్రీ ఇచ్చాడు నాగ్‌. ఎప్పటిలాగే వారితో గేమ్స్‌ ఆడిస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తూనే క్లిష్టమైన టాస్క్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాక ఎవరిని ఫ్రెండ్‌ చేసుకుంటారు? ఎవరిని బ్లాక్‌ చేస్తారు? అని అడిగాడు. ఈ గేమ్‌ గురించి విన్న తేజు 'కొంపలో కుంపటి' ప్రోగ్రామ్‌ అంటూ దానికి ఓ టైటిల్‌ కూడా ఇచ్చేసింది.

ముందుగా శివ.. బిందుమాధవిని ఫ్రెండ్‌ చేసుకుంటానన్నాడు. అనిల్‌.. అషూను ఫ్రెండ్‌ చేసుకుంటానంటే హమీదా మాత్రం అనిల్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేస్తానంది. సరయు అనిల్‌ను బ్రదర్‌లా ఫీల్‌ అవుతానని, అతడిని ఫ్రెండ్‌ చేసుకుంటానంది. తర్వాత నటరాజ్‌ మాస్టర్‌ అషూ గురించి చెప్తూ ఇలాంటి ఫ్రెండ్‌ ఉంటే నాలాంటోడు ఎప్పుడైనా ది బెస్ట్‌ ఉంటాడని పేర్కొన్నాడు. ఈ పొగడ్తలతో పొంగిపోయిన అషూ.. దయచేసి నన్ను హీరో చేయకండి సార్‌ అని మెలికలు తిరిగింది. ఇక బిందు, అనిల్‌, అజయ్‌, స్రవంతి.. నటరాజ్‌ మాస్టర్‌ను బ్లాక్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నిన్న కారాలు మిరియాలు నూరుకున్న అఖిల్‌, బిందు ఈరోజుమాత్రం ఇట్టే కలిసిపోయారు. మరి నాగ్‌ హౌస్‌మేట్స్‌తో ఇంకా ఎలాంటి గేమ్స్‌ ఆడించాడు. కెప్టెన్‌ నటరాజ్‌ మాస్టర్‌ ఇంకా గొడవపడుతున్నాడా? సైలెంట్‌ అయిపోయాడా? అన్నది తెలియాలంటే బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ లైవ్‌ లేదా నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: ట్రోలింగ్‌, సీక్రెట్‌ మ్యారేజ్‌పై స్పందించిన యాంకర్‌ భర్త

 కశ్మీర్‌ ఫైల్స్‌ వల్ల తన సినిమా ఎఫెక్ట్‌ అయిందన్న స్టార్‌ హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement